spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 లాంచింగ్ ఎపిసోడ్ అలా ప్లాన్ చేసిన...

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 లాంచింగ్ ఎపిసోడ్ అలా ప్లాన్ చేసిన మేకర్స్… కంటెస్టెంట్స్ పరిచయం ఎలా ఉంటుందంటే?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ షోని ఓ వర్గం విపరీతంగా వ్యతిరేకిస్తుంది. పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలను ఒక చోట ఉంచడం. వారి మధ్య రొమాన్స్… ఇవన్నీ భారతీయ సాంప్రదాయానికి వ్యతిరేకం అంటున్నారు. మన సంస్కృతిని ఇలాంటి రియాలిటీ షోలో నాశనం చేస్తున్నాయని వారు వాపోతున్నారు. సీపీఐ నారాయణ అయితే… పలుమార్లు బిగ్ బాస్ షోపై ధ్వజమెత్తారు. బిగ్ బాస్ షోని ఆయన బ్రోతల్ హౌస్ తో పోల్చడం సంచలన పరిణామం. ఇక హోస్ట్ నాగార్జున మీద కూడా నారాయణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ షోపై కేసులు వేశారు. నిరసనలు కూడా చేశారు. ఇంత వ్యతిరేకత ఉన్నా బిగ్ బాస్ షోని మేకర్స్ వదులుకోవడం లేదు. అందుకు కారణం బిగ్ బాస్ షో పట్ల జనాల్లో ఉన్న క్రేజ్. బిగ్ బాస్ షోని ఇష్టపడేవారి సంఖ్య అత్యధికంగా ఉంది. అది సీజన్ సీజన్ కి పెరుగుతూ పోతుంది. బిగ్ బాస్ షోకి మంచి టీఆర్పీ దక్కుతుంది. లాంచింగ్, ఫినాలే ఎపిసోడ్స్ టీఆర్పీలు అయితే రికార్డు స్థాయిలో ఉంటాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 8 కి రంగం సిద్ధం అవుతుంది. ఆగస్టు లోనే బిగ్ బాస్ సీజన్ 8 కానుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు పూర్తి అయ్యిందట. యూట్యూబర్ బంచిక్ బబ్లు, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, బర్రెలక్క, కుమారీ ఆంటీ, హేమ, సురేఖావాణి, అమృత ప్రణయ్, రీతూ చౌదరి, సోనియా సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వేణు స్వామి కూడా ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరీ ఆయనను షోలో తెస్తున్నారట.

కాగా లాంచింగ్ ఎపిసోడ్ పై ఓ ఆసక్తికర ప్రచారం ఊపందుకుంది. ప్రేక్షకుల్లో లాంచింగ్ ఎపిసోడ్ పై విపరీతమైన క్రేజ్ ఉంటుంది. స్టార్స్ గెస్ట్ ఎంట్రీలు, హీరోయిన్స్ డాన్స్ పెర్ఫార్మన్స్ లతో ఆకర్షణీయంగా బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ ప్లాన్ చేస్తారు. కంటెస్టెంట్స్ పరిచయం ఉత్కంఠ రేపే అంశం. ఈ సీజన్ లో ఎవరు హౌస్లోకి వెళతారనే ఉత్కంఠ అందరిలో ఉంటుంది. సీజన్ 7 మాదిరే సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట. మొదట కొందరు కంటెస్టెంట్స్ ని పంపుతారట. ఐదు వారాల తర్వాత మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరికొందరు కంటెస్టెంట్స్ ని ప్రవేశ పెడతారట. గత సీజన్లో ఈ ఫార్మలా బాగా వర్క్ అవుట్ అయ్యింది.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper