Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఈ వారం డబల్ ఎలిమినేషన్ కావడంతో నిన్న శనివారం ఎపిసోడ్ లో అశ్విని ని ఎలిమినేట్ చేసేసారు. అయితే నేడు రతిక ఎలిమినేట్ అయింది. కాగా ఇప్పటికే 12 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో ముగింపు దశకు వచ్చేసింది. ఇక కేవలం మూడు వారాలు మాత్రమే మిగిలున్నాయి. డబల్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో మొత్తం ఎనిమిది మంది ఉండగా వారిలో టాప్ 5 లో ఉండేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారిన అంశం.
కాగా ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ సర్వే నిర్వహించింది. ఆర్మాక్స్ సినీ తారల పై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ పై సర్వే నిర్వహించింది. అందులో టాప్ 5 లిస్టును రిలీజ్ చేసింది. అయితే మొదటి స్థానంలో శివాజీ నిలిచాడు. గత రెండు మూడు వారాల నుంచి శివాజీ కి నెగిటివ్ ఎపిసోడ్ లు పడ్డాయి. పైగా అమర్ కెప్టెన్సీ విషయంలో .. మాట తప్పి నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. కానీ మళ్ళీ హ్యాండ్ పెయిన్ .. నేను వెళ్ళిపోతాను అంటూ శివాజీ చెప్పిన మాటలను తన పీఆర్ టీమ్స్ బాగా వైరల్ చేశాయి.
దీంతో శివాజీ టాప్ 1 లోకి వచ్చాడు. ఇక తర్వాత పల్లవి ప్రశాంత్ టాప్ 2లో నిలిచాడు. ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లో అడుగుపెట్టి ఆడియన్స్ హృదయాలు గెలుచుకున్నాడు. ఒక సామాన్యుడు బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని వారాలు ఉండటం ఇదే మొదటిసారి. పైగా ఎటువంటి ఫాలోయింగ్ లేకుండా టాప్ 2 లో నిలిచి సత్తా చాటాడు రైతు బిడ్డ ప్రశాంత్. ఇక అమర్ దీప్ టాప్ 3లో ఉన్నాడు. కాగా అమర్ మొదట్లో డౌన్ అయ్యాడు కానీ .. రెండు వారాలుగా గేమ్ లో పుంజుకుని గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు.
బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి ఎంటువంటి గ్రూపిజం లేకుండా సోలో ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ టాప్ 4 లో నిలిచాడు. అసలు ఎవరు ఊహించని కంటెస్టెంట్ శోభా శెట్టి టాప్ 5 లో నిలవడం ఆశ్చర్యకరం. ఇవి ఆర్మాక్స్ సర్వే లో ఈ వారం తేలిన టాప్ 5 లో లిస్ట్. నిజంగా ఈ ఐదుగురు ఫైనల్ కి వెళితే సంచలనమే అని చెప్పాలి.
Ormax Characters India Loves: Top 5 most popular #BiggBossTelugu7 contestants (Nov 18-24) pic.twitter.com/UQxXpbeIp5
— Ormax Media (@OrmaxMedia) November 26, 2023