Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ ట్విస్ట్ ఊహించలేదు!

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ ‘బిగ్ బాస్ 10’ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత సీజన్ ఊహించిన దానికంటే పెద్ద హిట్ అయ్యింది కాబట్టి. టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో గత సీజన్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు. అందుకే ఈ సీజన్ […]

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ ‘బిగ్ బాస్ 10’ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత సీజన్ ఊహించిన దానికంటే పెద్ద హిట్ అయ్యింది కాబట్టి. టీఆర్ఫీ రేటింగ్స్ విషయం లో గత సీజన్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు. అందుకే ఈ సీజన్ పై సాధారణంగానే అంచనాలు ఉండడం సహజం. పైగా ఈ సీజన్ కి ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న సెలబ్రిటీలను తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అదే విధంగా గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని రాబోతున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఈ షో నుండి వచ్చిన ఆఫర్ పై జబర్దస్త్ పాపులర్ లేడీ కమెడియన్ సత్యశ్రీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘బిగ్ బాస్ 10 నుండి నాకు ఆఫర్ వచ్చిన విషయం వాస్తవమే. కానీ కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశాను. పైగా కుటుంబానికి దూరం గా అన్ని రోజులు నేను ఉండలేను. ఇంటి బయట కూడా చూసుకోవాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. నేను లేకపోతే పనులు జరగవు. బిగ్ బాస్ లాంటి గొప్ప రియాలిటీ షో లో అవకాశం రావడం అదృష్టం. కానీ పరిస్థితులు నన్ను తిరస్కరించేలా చేశాయి’ అంటూ చెప్పుకొచ్చింది సత్యశ్రీ. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న సత్య శ్రీ , అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపిస్తూ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె చమ్మక్ చంద్ర స్కిట్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పటికీ జబర్దస్త్ లో ఈమె కొనసాగుతూనే ఉంది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో రీసెంట్ గానే ఈమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. నటిగా సిల్వర్ స్క్రీన్ పైన కూడా ఈమె సక్సెస్ అయ్యింది. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని అందం తో కుర్రాళ్లలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సత్యశ్రీ ‘బిగ్ బాస్’ షో లోకి ఎంట్రీ ఇచ్చి ఉండుంటే , ఆమె కెరీర్ కి చాలా ఉపయోగపడేది, తెలుగు ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గరయ్యేది. బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper