Homeఎంటర్టైన్మెంట్BB Jodi 2: 'BB జోడి 2' టైటిల్ విన్నర్స్ వీళ్ళే..చివరి నిమిషం లో ఊహించని...

BB Jodi 2: ‘BB జోడి 2’ టైటిల్ విన్నర్స్ వీళ్ళే..చివరి నిమిషం లో ఊహించని ట్విస్టులు!

BB Jodi 2: గత కొన్ని రోజులుగా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘BB జోడి 2′(BB Jodi 2) డ్యాన్స్ రియాలిటీ ఎంత విజయవంతంగా కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘బిగ్ బాస్ 9’ ముగిసిన తర్వాత మొదలైన షో ఇది. ఈ షోలో బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ అందరూ పాల్గొంటున్నారు. గత సీజన్ నుండి కేవలం రీతూ చౌదరి, డిమోన్ పవన్ లు మాత్రమే జంట గా ఈ షోకి […]

BB Jodi 2: గత కొన్ని రోజులుగా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘BB జోడి 2′(BB Jodi 2) డ్యాన్స్ రియాలిటీ ఎంత విజయవంతంగా కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘బిగ్ బాస్ 9’ ముగిసిన తర్వాత మొదలైన షో ఇది. ఈ షోలో బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ అందరూ పాల్గొంటున్నారు. గత సీజన్ నుండి కేవలం రీతూ చౌదరి, డిమోన్ పవన్ లు మాత్రమే జంట గా ఈ షోకి వచ్చారు. అదే విధంగా శ్రీజ ఈమధ్య కాలంలో కీర్తి భట్ షో నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి చైతు కి జోడిగా ఎంట్రీ ఇచ్చింది. ఈమె కూడా రేపటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ కాబోతుంది. వచ్చే వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో జోడీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే షో మధ్యలోకి వచ్చేసింది కాబట్టి, ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా ఎవరు నిలబడబోతున్నారు అనే విషయంలో అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

ఉన్న వారిలో అమర్ దీప్, నైనికా జంట టాప్ స్థానం లో ఉన్నారు. గత నాలుగు వారాల నుండి మార్కుల విషయం లో అందరికంటే ఎక్కువ సంపాదిస్తూ గోల్డెన్ సోఫా ని సంపాదించుకుంటూ వస్తున్నారు. అదే విధంగా గ్రూప్ B లో మానస్, శ్రేష్టి వర్మ జంట కూడా మొదటి నుండి అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చూపిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉండగా గ్రూప్ A కంటెస్టెంట్స్ లో అమర్ దీప్, నైనికా జంట ఈ వారం కూడా అత్యధిక స్కోర్ ని సొంతం చేసుకోవడంతో, వాళ్లకు జడ్జీలు బ్రహ్మాస్త్రం ఒకటి అందించారు. దీనిని ఉపయోగించి ఎలిమినేషన్ నుండి తప్పించుకోవచ్చు, అదే విధంగా ఎవరైనా ఎలిమినేట్ అవుతుంటే వాళ్ళని అస్త్రం వాడి సేవ్ చేయొచ్చు. నేటి ఎపిసోడ్ లో ఈ పవర్ ని అమర్ దీప్, నైనికా జంట అందుకోవడం మనం చూడొచ్చు.

ఇదంతా పక్కన పెడితే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని త్వరలోనే మొదలు పెట్టబోతున్నారని. ఈ ఎపిసోడ్ లో కచ్చితంగా అమర్ దీప్, నైనికా మరియు మానస్,శ్రేష్టి వర్మ జంటలు టైటిల్ కోసం పోటీ పడబోతున్నాయని, కచ్చితంగా అమర్ దీప్, నైనికా జంట గెలుస్తుందని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి అది నిజం అవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే ఈ సీజన్ లో ఏది కూడా అనుకున్నట్టు జరగడం లేదు. ఎవ్వరూ ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఈసారి కూడా అలాంటిది ఏమైనా జరగొచ్చేమో అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper