Homeఎంటర్టైన్మెంట్Amardeep Nainika controversy: 'BB జోడీ 2' లో అమర్ దీప్, నైనిక జంటకు అన్యాయం..శేఖర్...

Amardeep Nainika controversy: ‘BB జోడీ 2’ లో అమర్ దీప్, నైనిక జంటకు అన్యాయం..శేఖర్ మాస్టర్ పై మండిపడుతున్న నెటిజెన్స్!

Amardeep Nainika controversy: స్టార్ మా ఛానల్ లో ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘BB జోడి 2′(BB Jodi 2) ప్రోగ్రాం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ అందరిలో అమర్ దీప్(Amardeep Chowdary), నైనికా(Nainika) జంట టాప్ రేంజ్ లో కొనసాగుతున్నారు. వీళ్లిద్దరు కలిసి వేసే డ్యాన్స్ స్టెప్పులు వేరే లెవెల్ లో ఉంటాయి. ఒకరి పై ఒకరు పోటీ పడుతూ చేస్తుంటారు. మొదటి వారం నుండి, మొన్నటి వారం వరకు తమ అద్భుతమైన డ్యాన్స్ తో టాప్ స్కోర్ ని సొంతం చేసుకుంటూ గోల్డెన్ సోఫా ని దక్కించుకుంటూ వస్తున్నారు. అయితే ప్రతీ సారీ వాళ్ళకే గోల్డెన్ సోఫా దక్కుతుండడం తో ఈసారి ఎలా అయినా వాళ్ళను కిందకు దించాలి, కొత్త వాళ్లకు ఆ సోఫా లో కూర్చునే అవకాశం ఇవ్వాలని బ్లైండ్ గా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం ‘సూపర్ స్టార్స్ థీమ్’ జరగనుంది. ఈ థీమ్ లో కంటెస్టెంట్స్ టాలీవుడ్ స్టార్ హీరోలకు సంబంధించిన సూపర్ హిట్ పాటలను ఎంచుకొని డ్యాన్స్ వెయ్యాలి. అమర్ దీప్, నైనికా జంట రవితేజ పాటకు డ్యాన్స్ వేస్తారు. శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కూడా విడుదల చేశారు. ఈ ప్రోమో లో అమర్ దీప్ , నైనికా జంట బాగానే డ్యాన్స్ వేసినప్పటికీ, శేఖర్ మాస్టర్ వంకలు చెప్పడం ఆడియన్స్ కి అసలు ఏమాత్రం నచ్చలేదు. ఆయన మాట్లాడుతూ ‘అంతకు ముందు చూసిన అమర్ దీప్, నైనికా నాకు కనపడడం లేదు. ఏమి ప్రాక్టీస్ కి టైం లేదా?, నైనికా నువ్వు అయితే అసలు పాట పాడడం లేదు’ అని అంటాడు. ఇక ఆ తర్వాత డిమోన్ పవన్ మాట్లాడుతూ ‘ఈ స్టెప్పులు చాలా రెగ్యులర్ వి..మీరు చేస్తే అంత కిక్ రావట్లేదు’ అంటాడు.

ఇక ఆ తర్వాత సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘కొంచెం పవర్ తగ్గినట్టు అనిపించింది’ అని అంటాడు. చివర్లో శ్రీ సత్య మాట్లాడుతూ ‘ఇప్పటికే ఒకసారి చూసిన యాక్ట్ లాగా అనిపించింది’ అని అంటుంది. వాస్తవానికి శ్రీ సత్య, అర్జున్ జంట ఈ ప్రోమో లో చాలా యావరేజ్ గా డ్యాన్స్ వేశారు. కానీ వాళ్లకు మాత్రం అదిరిపోయే రేంజ్ డ్యాన్స్ వేశారని జడ్జీలు కామెంట్స్ చేయడం, బాగా చేసిన అమర్ దీప్, నైనికా లను మాత్రం తొక్కేయాలని చూడడం చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మొత్తానికి ఈ వారం తో అమర్ దీప్, నేనిక జంటలు గోల్డెన్ సోఫా నుండి దిగబోతున్నారు అనేది ఫిక్స్ అయిపోవచ్చు.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular