spot_img
Homeఎంటర్టైన్మెంట్YV Subbareddy Old Tweet: తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యిని 2022 లోనే గుర్తించారా..? సంచలనం...

YV Subbareddy Old Tweet: తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యిని 2022 లోనే గుర్తించారా..? సంచలనం రేపుతున్న వైవీ సుబ్బారెడ్డి పాత ట్వీట్!

YV Subbareddy Old Tweet: వెంకటేశ్వర స్వామి తో ఆటలొద్దు, ఆయన చాలా పవర్ ఫుల్, మీరు ఆయన విషయం లో అన్యాయం చేయాలనీ చూసినా, అబద్దాలు చెప్పాలని ప్రయత్నం చేసినా, అసలు కుదరదు, మీ నోటితోనే వాస్తవ నిజాలను కక్కిస్తాడు అని పెద్దలు అంటుంటారు. అందుకే ఎంత పెద్ద వాళ్ళు అయినా తిరుమల వెంకటేశ్వర స్వామి విషయం లో వళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉంటారు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియా లో తిరుమల లడ్డూ వ్యవహారం పై ఏ స్థాయి చర్చలు నడుస్తున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ వ్యవహారం లో సోషల్ మీడియా ద్వారా మరో సాలిడ్ ప్రూఫ్ ని బయటపడేలా చేసాడు కలియుగ దైవం వెంకటేశ్వర సామీ. అప్పట్లో TTD బోర్డు లో కీలక పదవీ చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి రీసెంట్ గానే ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిన విషయం వాస్తవమే అని ఒప్పుకున్నాడు.

ఇప్పుడు లేటెస్ట్ గా 2022 వ సంవత్సరం లో వైవీ సుబ్బారెడ్డి ట్విట్టర్ సాక్షిగా తిరుమల లడ్డు క్వాలిటీ విషయం లో కొన్ని ట్వీట్లు వేశాడు. ఆయన మాట్లాడుతూ ‘TTD మార్కెటింగ్ గోడౌన్ లో ఆకస్మిక తనికీలు నిర్వహించాను. ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పులో నాణ్యత లోపించడాన్ని గమనించాను. తక్షణమే సదరు కాంట్రాక్టర్ టెండర్ ని రద్దు చేయాలనీ అధికారులను ఆదేశించాను. యాలకులు, నెయ్యి కూడా నాణ్యత లేవనే విషయాన్నీ గ్రహించాను. వాటిని ప్రభుత్వ ల్యాబ్ కు పరీక్షల కోసం పంపాలని ఆదేశించాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన ట్వీట్ ని మీరు క్రింద చూడొచ్చు. ఈ ట్వీట్ క్రింద ఒక వైసీపీ వీరాభిమాని రెస్పాన్స్ ని కూడా మనం చూడొచ్చు.

ఆయన మాట్లాడుతూ ‘అయ్యా మీకో నమస్కారం. ఇప్పటికైనా తిరుమలలో ఏమి జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా వయస్సు 40 ఏళ్ళు. ఇప్పటి వరకు నేను ఎన్నోసార్లు తిరుపతి లడ్డును ప్రసాదాన్ని తిన్నాను. కానీ గత ఆరు నెలలుగా లడ్డూ ప్రసాదం రుచ్చి చూసిన వాళ్లకు వాళ్లంతా దద్దుర్లు వస్తున్నాయి. నెయ్యి కల్తీ జరుగుతుంది, మహా ప్రభో దీనిని సరి చేయండి’ అంటూ ట్వీట్లు వేశాడు. మొన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ లో ఈ అంశం గురించి మాట్లాడుతూ, 2022 లో ల్యాబ్ టెస్టు రిపోర్ట్స్ లో కల్తీ జరుగుతుంది అనే రిపోర్ట్ వచ్చింది. దానిని మీరంతా తొక్కి పారేశారు. మీకు ఈ విషయం తెలిసే తప్పు చేసారు అని అంటాడు. ఈరోజు ఈ ట్వీట్స్ ని చూస్తూ, పవన్ కళ్యాణ్ చెప్పిన దానిని కనెక్ట్ చేసి చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది కదూ. ఇంత అన్యాయం చేసి , పైగా ఎదురుదాడి చేయడం అనేది చూస్తుంటే వైసీపీ రాజకీయ జీవితం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Srinivasa Mangapuram

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ లు…

Srinivasa Mangapuram: మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇక తన అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు....
Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Oktelugu Epaper