Homeఎంటర్టైన్మెంట్Pushpa Actor Arrested: మహిళ ఆత్మహత్య కేసులో ‘బన్నీ’ రైట్ హ్యాండ్ అరెస్ట్.. పుష్ప2 సినిమాకు...

Pushpa Actor Arrested: మహిళ ఆత్మహత్య కేసులో ‘బన్నీ’ రైట్ హ్యాండ్ అరెస్ట్.. పుష్ప2 సినిమాకు బ్రేక్!

Pushpa Actor Arrested: పుష్ప మూవీలో కేశవ పాత్ర చేసిన బండారు జగదీశ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరుపరిచారు. జూనియర్ ఆర్టిస్ట్ అయిన మహిళ ఆత్మహత్య వెనుక జగదీశ్ హస్తం ఉందని నమ్మిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నవంబర్ 29న పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె వృత్తిరీత్యా జూనియర్ ఆర్టిస్ట్. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

విచారణలో జగదీశ్ ప్రమేయం ఉందని తెలిసింది. నవంబర్ 27న సదరు మహిళ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు తీసిన జగదీశ్ బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడని సమాచారం. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని మహిళను జగదీష్ బెదిరించాడు. ఆందోళన, మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది. కొద్దిరోజులుగా పోలీసులు జగదీష్ కోసం గాలిస్తున్నారు. ఎట్టకేలకు పట్టుబట్టాడు.

అతన్ని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన టాలీవుడ్ లో ప్రకంపనలు రేపింది. పుష్ప మూవీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు జగదీశ్. హీరో అల్లు అర్జున్ ఫ్రెండ్ గా ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. పుష్ప మూవీ జగదీష్ వాయిస్ ఓవర్ తోనే నడుస్తుంది. అంతటి కీలక రోల్ జగదీష్ కి దక్కింది. పుష్ప బ్లాక్ బస్టర్ కావడంతో జగదీష్ మరింత పాపులర్ అయ్యాడు.

పుష్ప అనంతరం జగదీష్ కి పరిశ్రమలో ఆఫర్స్ పెరిగాయి. ఓటీటీ లో కూడా పలు ప్రాజెక్ట్స్ చేశాడు. పుష్ప 2లో కూడా జగదీష్ నటిస్తున్నాడు. జగదీష్ అరెస్ట్ తో ప్రాజెక్ట్ అయోమయంలో పడింది. మరి జగదీష్ పాత్రను రీప్లేస్ చేస్తారా? లేక అతన్నే కొనసాగిస్తారా? అనేది చూడాలి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2లో రష్మిక మందాన హీరోయిన్. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper