Homeఎంటర్టైన్మెంట్Balakrishna New Movie Updates 2026: బాలయ్య కోసం పడిగాపులు కాస్తున్న తమిళ డైరెక్టర్... ఫైనల్...

Balakrishna New Movie Updates 2026: బాలయ్య కోసం పడిగాపులు కాస్తున్న తమిళ డైరెక్టర్… ఫైనల్ గా ఏం అయిందంటే..?

Balakrishna New Movie Updates 2026: బాలయ్య బాబు హీరోగా చేస్తున్న సినిమాలకు భారీ క్రేజ్ వస్తుంది. కమర్షియల్ సినిమాలను చేయడంలో బాలయ్య బాబును మించిన హీరో తెలుగు సినిమా సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనేది వాస్తవం. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపైతే వచ్చింది. అలాంటి త్రివిక్రమ్ ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలావరకు ముందుకు అడుగులు వేస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాలు పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ […]

Balakrishna New Movie Updates 2026: బాలయ్య బాబు హీరోగా చేస్తున్న సినిమాలకు భారీ క్రేజ్ వస్తుంది. కమర్షియల్ సినిమాలను చేయడంలో బాలయ్య బాబును మించిన హీరో తెలుగు సినిమా సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనేది వాస్తవం. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపైతే వచ్చింది. అలాంటి త్రివిక్రమ్ ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలావరకు ముందుకు అడుగులు వేస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాలు పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత మరో ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయడానికి కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. ఒక తమిళ్ డైరెక్టర్ మాత్రం బాలయ్య కోసం రోజు పడిగాపులు కాస్తున్నాడని వార్తలైతే వినిపిస్తున్నాయి. బాలయ్య బాబుతో ఒక్క సినిమా చేసి తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఆ దర్శకుడు ఉన్నాడట.

Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!

ఇంతకీ ఆయన ఎవరు అంటే లింగుస్వామి గా తెలుస్తుంది. పందెం కోడి, ఆవారా లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన ఆయన ఆ తర్వాత సూర్య తో చేసిన ‘సికిందర్’ సినిమా ఫ్లాప్ అయింది. తెలుగులో రామ్ ను హీరోగా పెట్టి చేసిన ‘వారియర్’ సినిమా సైతం డిజాస్టర్ ని మూటగట్టుకుంది.దాంతో ఆయనకు తెలుగు సినిమా హీరోలు ఎవరు అవకాశాలను ఇవ్వడం లేదు.

ఇక ఎట్టకేలకు ఆయన బాలయ్య బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. తను రాసుకున్న కథను వినిపించడానికి బాలయ్య బాబు వెంట పడుతున్నాడట. బాలయ్య మాత్రం ప్రస్తుతం ఉన్న సినిమా కమిట్ మెంట్ల తో బిజీగా ఉండడం వల్ల తను ఆ కథను వినడానికి కూడా సిద్ధంగా లేనట్టుగా తెలుస్తుంది.

అయినప్పటికి పట్టు వదలని విక్రమార్కుడిలా లింగు స్వామి బాలయ్య వెంటే పడుతున్నాడట. ఇక ఎట్టకేలకు బాలయ్య కథను వింటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టుగా లింగు స్వామి సినిమాలను చేయగలుగుతాడా? ఒకవేళ చేసిన అది తెలుగు ప్రేక్షకులను మెప్పించగలుగుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper