Homeఎంటర్టైన్మెంట్Balakrishna Routine Movies Criticism: బాలయ్య తో సినిమాలంటే ఇవే కథలతో చేయాలా... వేరే కథలు...

Balakrishna Routine Movies Criticism: బాలయ్య తో సినిమాలంటే ఇవే కథలతో చేయాలా… వేరే కథలు దొరకడం లేదా…

Balakrishna Routine Movies Criticism: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేస్తున్న సినిమాల కథలన్నీ ఒకే జానర్ లో ఉంటున్నాయి. బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించడం ఒక పాత్రకి అన్యాయం జరిగితే మరొక పాత్ర వచ్చి విలన్స్ తుప్పు రేగొట్టడం ఇలాంటి కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. నిజానికి బాలయ్య బాబు చాలా మంచి నటుడు అతనికి ఎలాంటి పాత్రనిచ్చిన కూడా నటించి మెప్పించగలిగే కెపాసిటి ఆయనకుంది. మరి అలాంటి నటుడిని పట్టుకొని రొటీన్ టెంప్లేట్ […]

Balakrishna Routine Movies Criticism: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేస్తున్న సినిమాల కథలన్నీ ఒకే జానర్ లో ఉంటున్నాయి. బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించడం ఒక పాత్రకి అన్యాయం జరిగితే మరొక పాత్ర వచ్చి విలన్స్ తుప్పు రేగొట్టడం ఇలాంటి కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. నిజానికి బాలయ్య బాబు చాలా మంచి నటుడు అతనికి ఎలాంటి పాత్రనిచ్చిన కూడా నటించి మెప్పించగలిగే కెపాసిటి ఆయనకుంది. మరి అలాంటి నటుడిని పట్టుకొని రొటీన్ టెంప్లేట్ లో సినిమాలు ఎందుకు చేస్తున్నారు. దర్శకులకు వేరే కథలు దొరకడం లేదా? బాలయ్య బాబుతో వేరే కథలు చేస్తే వర్కౌట్ అవ్వవా? కేవలం మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసే అలాంటి సినిమాలను చేయాలా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటివరకు బాలయ్య చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అదే రొటీన్ టెంప్లేట్ లో సినిమాలు వస్తుండడం వల్ల అతని సినిమాలు చూడడానికి కొంతమంది ప్రేక్షకులు సైతం ఉత్సాహం చూపించడం లేదు…

గతంలో బాలయ్య చేసిన ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి సినిమాలను ఇప్పుడు చేస్తే బాగుంటుంది… భారీ బడ్జెట్ తో కాకుండా మీడియం రేంజ్ బడ్జెట్ లో కూడా అలాంటి సినిమాలను చెయ్యొచ్చు అని కొంతమంది సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక దీని మీద బాలయ్య స్పందించడం లేదు. నిజానికి బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న మూవీ కమర్షియల్ సినిమా గానే రాబోతుందట.

మొదట గోపీచంద్ మలినేని బాలయ్య బాబుకి ఒక హిస్టారికల్ నేపథ్యంలో ఉన్న ఫిక్షనల్ స్టొరీ చేద్దామని చెప్పినప్పటికి బాలయ్య ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కానీ ఆ సినిమా బడ్జెట్ పెరిగిపోతుండటం వల్ల ఆ సినిమాని వద్దని కమర్షియల్ సినిమాతోనే వెళ్దామని చెప్పారట. బాలయ్య మీద 200 కోట్ల వరకు బడ్జెట్ పెట్టిన కూడా సినిమాలో క్వాలిటీ ఉంటే ఈజీగా 400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుంది.

కానీ బాలయ్య బాబు మాత్రం రిస్క్ ఎందుకని ప్రొడ్యూసర్లు సైతం సేఫ్ జోన్ లో ఉండాలనే ఉద్దేశంతో ఉన్నారట. కాబట్టి బాలయ్య తన దగ్గరికి వస్తున్న డైరెక్టర్లతో భారీ బడ్జెట్ తో కాకుండా 60 కోట్ల లోపు కంప్లీట్ అయ్యే కమర్షియల్ సినిమాని చేద్దామని చెబుతున్నారట…అలా అయితే ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్ లో ఉంటారని ఆయన చెబుతున్నాడట…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper