Homeఎంటర్టైన్మెంట్Balayya: అందరి కళ్లు బాలయ్య చేతిపైనే.. అసలు ఆయనకు ఏమైంది?

Balayya: అందరి కళ్లు బాలయ్య చేతిపైనే.. అసలు ఆయనకు ఏమైంది?

Balayya: ఏపీ అసెంబ్లీలో నందమూరి ఫ్యామిలీని అవమానిస్తూ వైసీపీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు కన్నీరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ.. నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చారు. తమ కుటుంబంపై, ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు. అయితే, ఈ సమావేశంలో అందరి కళ్లు బాలయ్య ఎడమచేతి మీదే ఉన్నాయి. ఆయన చేతికి కట్టుకుని మీడియా ముందు కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

balayya

దీంతో, అసలు బాలయ్యకు ఏమైందంటూ… ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. గత ఆరునెలలుగా బాలయ్య భుజన నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబరు 31న బంజారాహిల్స్​లోని కేర్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన బాలయ్య.. సర్జరీ తర్వాత తొలిసారి మీడియా ముందుకు రావడం జరిగింది.

కాగా, ప్రస్తుతం బాలయ్య ఆహా వేదికగా అన్​స్టాపబుల్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ షోలో పాల్గొనడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా మూడు షోలకు ప్లాన్ చేసినట్లు సమాచారం. తర్వాత ఎపిసోడ్​ త్వరలోనే ఉంటుందని ఇండస్ట్రీలో టాక్​. అయితే, ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు, బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన ట్రైలర్​ ఊరమాస్​లో ఉంది. మిలియన్ల వ్యూస్​తో రికార్డులు సృష్టిస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper