‘హాట్ యాంకర్ అనసూయ’ మరోసారి తల్లి కావాలని ఆశ పడుతుంది. మాతృత్వాన్ని అనుభవించాలనే కోరిక ఆమెలో రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికరమైన బోల్డ్ విషయాలను ప్రేక్షకులతో మొహమాటం లేకుండా చక్కగా పంచుకుంది ఈ హాట్ బ్యూటీ. పైగా కుదిరితే ఆడపిల్లనే కనాలని ఆశ పడుతుంది.
మాతృత్వం అనుభూతి తనకు ఎంతో ఇష్టమని, ఒకరికి జన్మని ఇస్తే ఆ ఫీలింగ్ సూపర్ అని అంటుంది అనసూయ. ఒకవేళ తనకు పాప పుడితే తన లైఫ్ లో ఎక్కువ సమయాన్ని ఆ పాపకే కేటాయిస్తోందట. ఆడపిల్లను పెంచి పోషించడంలో ఓ థ్రిల్ ఉంటుందని చెబుతోంది. అసలు ఇలాంటి కామెంట్స్ అనసూయకే సాధ్యం అనుకుంటా. ఇప్పటికే అనసూయకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇప్పుడు మళ్ళీ తల్లి కావాలనుకుంటుందట. మరి ఆమెగారి భర్త అభిప్రాయం ఏంటో తెలీదు కానీ, మళ్లీ తల్లి అవ్వాలనే అనసూయ కోరికను భరద్వాజ్ తీరుస్తాడో లేదో మరి. ఏది ఏమైనా బుల్లితెరపై యాంకర్ గా తన హవా కొనసాగిస్తున్న అనసూయ.. వెండితెరపై కూడా సత్తా చాటుతూ దూసుకుపోతుంది. టీవీ ప్రోగ్రామ్స్ – సినిమాలతో బిజీగా ఉంటూనే.. తన ఇద్దరు పిల్లల ఆలనాపాలనాతో ఇప్పుడు మళ్ళీ తల్లి కావడానికి ప్లాన్ చేసుకుంటుంది.
అసలు అనసూయకు ఈ కోరిక పుట్టడానికి కారణం, “థాంక్యూ బ్రదర్” అనే సినిమాలో ప్రేగ్నన్ట్ లేడీగా దర్శనమిచ్చి మెప్పించింది. ఆ క్యారెక్టర్ లో నటించేటప్పుడు ఆమెకు మళ్ళీ తల్లి కావాలనే ఆశ పుట్టింది. మరి 37 ఏళ్ల అనసూయ ఇప్పుడు మళ్ళీ తల్లి అయితే, ఆమెకు వరుసగా వస్తోన్న సినిమాలు ఇక రాకుండా పోతాయేమో.