spot_img
Homeఎంటర్టైన్మెంట్Adipurush: 'ఆదిపురుష్' థియేటర్స్ లో 'హనుమంతుడి' కోసం సీట్లు ఖాళీగా ఉంచబోతున్న మూవీ టీం..చరిత్ర లో...

Adipurush: ‘ఆదిపురుష్’ థియేటర్స్ లో ‘హనుమంతుడి’ కోసం సీట్లు ఖాళీగా ఉంచబోతున్న మూవీ టీం..చరిత్ర లో ఇదే తొలిసారి!

Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈ నెల 16 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఈ సినిమాకి మొత్తానికి మోక్షం లభించింది. తమ అభిమాన హీరో ని సాక్ష్యాత్తు శ్రీ రాముని అవతారం లో వెండితెర మీద చూడడం, ఫ్యాన్స్ తమకి దొరికిన అరుదైన అదృష్టంగా భావిస్తున్నారు. మూవీ టీం కూడా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపబోతున్నారు.

ఈ ఈవెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో చిరస్థాయిగా గుర్తుండిపోయ్యేలాగ ఉంటుందట. సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రముఖులతో పాటుగా ఆధ్యాత్మిక గురువు చిన్నజియ్యర్ స్వామి కూడా ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధి గా పాల్గొనబోతున్నారు. ఇది ఇలా ఉండగా రామాయణం ని గౌరవిస్తూ మూవీ యూనిట్ లేటెస్ట్ గా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే రామాయణం కి సంబంధించి ఏది జరిగిన అక్కడకి ఆంజనేయ స్వామి విచ్చేస్తాడని మన పూర్వికులు అంటూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలను విశ్వసిస్తూ ఆదిపురుష్ చిత్రం విడుదలయ్యే ప్రతీ థియేటర్ లో ఒక సీట్ ని ఖాళీగా ఉంచబోతున్నారట. అతి గొప్ప శ్రీ రాముని భక్తుడిగా ప్రసిద్ధి గాంచిన చిరంజీవి ఆంజనేయ స్వామి కి మర్యాదలు ఇస్తూ చరిత్ర ఎన్నడూ కూడా కనీవినీ ఎరుగని స్థాయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మూవీ టీం.

నమ్మకాలను గౌరవిస్తూ, ఇంత గొప్ప కార్యక్రమానికి తలపెట్టిన ఆదిపురుష్ టీం కి ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు మరియు ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.ఈరోజు సాయంత్రం రిలీజ్ ట్రైలర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారు. దీనికి ఏ రేంజ్ రెస్పాన్స్ రాబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Oktelugu Epaper