క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ తో నటిస్తున్న సంగతి తెలిసిందే. నటిస్తోంది అంటే.. ఏదో సైడ్ క్యారెక్టర్ లో కాదండోయ్. అమితాబ్ తో సమానంగా ఉండే క్యారెక్టర్ చేస్తోంది. పైగా, ఇది పాన్ ఇండియా మూవీ. టైటిల్ వచ్చేసి ‘గుడ్ బై’. పేరులోనే వీడ్కోలు ఉంది కాబట్టి, సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుందట.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ నేడు స్టార్ట్ అయింది. మొదటిరోజు అమితాబ్, రష్మికల పై కొన్ని కీలక సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఇక అమితాబ్ సెట్ లోకి అడుగు పెట్టక ముందే రష్మిక సెట్ కి వెళ్ళిపోయింది. పైగా అమితాబ్ కోసం ఓ ప్రత్యేక గిఫ్ట్ కూడా పట్టుకుపోయింది. మరి అమితాబ్ లాంటి గొప్ప నటుడికి ఈ యంగ్ బ్యూటీ ఏం గిఫ్ట్ ఇచ్చిందో !!
ఇక ఈ సినిమా సెట్స్ లో రష్మిక – అమితాబ్ కలిసి ఉన్న ఒక ఫోటో మొత్తానికి బయటికి వచ్చి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ రష్మిక ఈ సినిమాలో అమితాబ్ కి కూతురిగా నటిస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్. అలాగే మరో క్రేజీ న్యూస్ కూడా వినిపిస్తోంది.
అమితాబ్ తో రష్మిక ప్రేమలో పడుతుందని, తాత వయసులో ఉన్న వ్యక్తితో ప్రేమ ఏమిటి ? అసలు ఆమె ఎందుకు అమితాబ్ ను ఇష్టపడింది అనే కోణంలో ఈ సినిమా సాగుతుందట. మొత్తానికి కథ ఏదైనా.. ఎండింగ్ మాత్రం అమితాబ్ పాత్ర చనిపోతుంది అని, సినిమా ముగింపు వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాలో నటించే అవకాశం రావడం తన అదృష్టం అని రష్మిక, ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అన్నట్టు ఇది రష్మికకు బాలీవుడ్ లో రెండో మూవీ. మొదటి సినిమా ‘మిషన్ మజ్ను’. ఈ సినిమా కూడా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Amitabh bachchan and rashmika mandannas look from goodbye
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com