Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Lokesh film stopped: అర్థాంతరంగా ఆగిపోయిన అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్...

Allu Arjun Lokesh film stopped: అర్థాంతరంగా ఆగిపోయిన అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ మూవీ.. కారణం ఏంటంటే..

Allu Arjun Lokesh film stopped: ‘పుష్ప’ సిరీస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘పుష్ప 2’ తర్వాత ఎలాంటి డైరెక్టర్ తో చేయబోతున్నాడు అనే ప్రశ్నలకు తెరదించుతూ , ఒక సెన్సేషనల్ సైన్స్ ఫిక్షన్ జానర్ ‘రాకా’ చెయ్యబోతున్నాని, ఈ చిత్రానికి తమిళం లో అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్స్ లో ఒకరైన అట్లీ దర్శకత్వం వహిస్తాడని , ఒక క్రేజీ వీడియో తో ప్రకటన చేసి సెన్సేషన్ సృష్టించాడు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు నుండే అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా మాస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమాని ప్రకటించి మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు .

ఈ ప్రకటన కు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో షేక్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో కి సంబంధించిన మ్యూజిక్ తో మిలియన్ల సంఖ్యలో రీల్స్ కూడా పడ్డాయి. ఆ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే అంత గ్రాండ్ గా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అట్టకెక్కిందని ఫిలిం నగర్ లో జోరుగా వినిపిస్తున్న వార్త. చెన్నై లో ఉండే లోకేష్ కనకరాజ్ ని హైదరాబాద్ కి తీసుకొచ్చి , ఆయనకు ప్రత్యేకంగా ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. గత నాలుగు నెలలుగా ఆయన ఆ ఆఫీస్ లో తన రైటింగ్ టీం తో కలిసి అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన స్టోరీ ని రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యాడు.

రీసెంట్ గా పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని అల్లు అర్జున్ కి వినిపించాడట లోకేష్ కనకరాజ్. ఆయనకు సరిగా నచ్చకపోవడం తో మార్పులు చేర్పులు చేసుకొని రమ్మని సూచించాడట. కొన్ని రోజులు తర్వాత అల్లు అర్జున్ సూచించిన మార్పులు చేసి , స్క్రిప్ట్ ని డెవలప్ చేసి గత వారమే వినిపించాడట లోకేష్. కానీ అల్లు అర్జున్ కి ఏ మాత్రం నచ్చలేదట. ఇలాంటి స్క్రిప్ట్ తో వెళ్తే ఫ్లాప్ తప్పదని భావించిన అల్లు అర్జున్ , ఈ ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కంటే ముందుగా ఆయన మలయాళం డైరెక్టర్ తో పని చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాడట . లోకేష్ కనకరాజ్ తో పూర్తిగా సినిమాని రద్దు చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular