Homeఎంటర్టైన్మెంట్Peddi Overseas Premier Talk: 'పెద్ది' ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ టాక్ వచ్చేసింది.. సినిమాలోని ప్లస్సులు...

Peddi Overseas Premier Talk: ‘పెద్ది’ ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ టాక్ వచ్చేసింది.. సినిమాలోని ప్లస్సులు , మైనస్సులు ఇవే..

Peddi Overseas Premier Talk: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం మరి కాసేపట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ ద్వారా విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో ఇది వరకే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో మనమంతా చూశాము. ఈ చిత్రం కోసం ఆయన తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేసాడు , ఎన్నో దెబ్బలు కూడా తగిలించుకున్నాడు. ప్రమోషనల్ […]

Peddi Overseas Premier Talk: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం మరి కాసేపట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ ద్వారా విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో ఇది వరకే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో మనమంతా చూశాము. ఈ చిత్రం కోసం ఆయన తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పని చేసాడు , ఎన్నో దెబ్బలు కూడా తగిలించుకున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ కి తెగ నచ్చడం తో ఈ చిత్రం పై హైప్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది. ఆ హైప్ కి తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ రేంజ్ లో జరిగాయి. ట్రేడ్ అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు + ప్రీమియర్ షోస్ కి కలిపి ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని కాసేపటి క్రితమే లండన్ లో ప్రదర్శించారు. అక్కడి నుండి వచ్చిన పబ్లిక్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ఎవ్వరూ ఊహించని రేంజ్ లో, చాలా అద్భుతంగా ఉండబోతుందని , రంగస్థలం చిత్రం ఒక మూలకు కూడా సరిపోదని , కచ్చితంగా ఆయన ఈ సినిమాతో నేషనల్ అవార్డు ని కైవసం చేసుకుంటాడని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుందని , సరదాగా సాగిపోతుందని , ఇంటర్వెల్ నుండి వేరే లెవెల్ కి వెళ్తుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ ఆరంభం లో ఒక అరగంట వరకు సినిమా స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా ఉంటుందని, ఆ తర్వాత చివరి 45 నిమిషాలు మాత్రం వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ కి కాళ్ళు కూడా పోతాయట. అయినప్పటికీ ఒలింపిక్స్ లో గేమ్స్ ఆడి గెలిచి , తన ఊరికి ఎనలేని ప్రతిష్టని తీసుకొచ్చే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ తర్వాత , ప్రేక్షకులు జీవితాంతం గుర్తుపెట్టుకుని మరో క్యారెక్టర్ జగపతి బాబు పోషించిన అప్పలసూరి క్యారెక్టర్. ఈ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని , హీరో తన ఊరి కోసం పోరాటం చేయడానికి ఈ పాత్ర ఎంతో ఆదర్శంగా నిలుస్తుందని , ఈమధ్య కాలం లో జగపతి బాబు కి ఇంతటి సాలిడ్ క్యారెక్టర్ పడలేదని అంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper