Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందులో రష్మికా హీరోయిన్గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్, సునీల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అనసూయ కూడా మాస్ క్యారెక్టర్లో దర్శనమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబరు 17న ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఇటీవలే హిందీ వర్షన్ విడుదలకు సంబంధించిన సమస్యలు కూడా తీరిపోయినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్‌కు కేరళలోనూ భారీగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే 40 థియేటర్లలో పుష్ప బుకింగ్స్ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ 40 థియేటర్లలో ఫ్యాన్ షో వేయనున్నట్లు సమాచారం. అయితే, డిసెంబరు 17నాటికి ఆ రాష్ట్రంలో 100కిపైగా థియేటర్లలో పుష్ప విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మీక నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సునీల్, ఫాహద్ ఫజిల్ ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు సుకుమార్. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. జగపతి బాబు, సునీల్, అనసూయ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More