Akhil Lenin Success Meet: వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురుకునే వ్యక్తి జీవితం లో , ఒక్క సక్సెస్ వస్తే చాలు, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మీలో కూడా ఎవరో ఒకరు మీ జీవితం లో ఈ అనుభూతిని పొందే ఉంటారు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ సరిగ్గా అలాంటి అనుభూతినే పొందుతోంది. అఖిల్ వెండితెర అరంగేట్రం చేసినప్పటి నుండి , నిన్న మొన్నటి వరకు కూడా కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా లేదు అనే సంగతి అందరికీ తెలిసిందే. అఖిల్ కి ఇక ఎప్పటికీ హిట్ రాదు , ఇక ఆయన హీరోగా పనికిరాదు అంటూ సోషల్ మీడియాలో అనేక మంది అతన్ని అవహేళన చేశారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా కౌంటర్లు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ట్రాక్ రికార్డు అలా ఉన్నింది మరి. సరిగ్గా అలాంటి సమయం లోనే ‘లెనిన్’ చిత్రాన్ని ప్రకటించారు.
ఈ సినిమా విడుదలకు ముందే నాగార్జున నుండి స్టాంప్ పడిపోయింది. కచ్చితంగా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని , కొత్త అఖిల్ ని చూస్తారు అంటూ ఆయన చాలా నమ్మకం గా చెప్పిన మాటలను చూసి అభిమానులు మాత్రమే కాదు , ప్రేక్షకులు కూడా నమ్మారు. ప్రమోషనల్ కంటెంట్ కూడా చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. అలా మంచి హైప్ తో విడుదలైన ఈ సినిమా నిన్న ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ టాక్ కి తగ్గట్టుగానే సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. కెరీర్ లో ఒక్క సక్సెస్ కూడా లేకుండా ఈ రేంజ్ ఓపెనింగ్ సాధించడం చూస్తుంటే , అఖిల్ పొటెన్షియల్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే నేడు ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో అభిమానులకు కావాల్సినంత గూస్ బంప్స్ , ఎమోషనల్ మూమెంట్స్ దొరికాయి.
ఈ ఈవెంట్ లో సినిమా థియేటర్స్ వద్ద అభిమానుల రియాక్షన్స్ అన్నిటిని కలిపి ఒక వీడియో గా చేసి LED పై ప్లే చేశారు. ఈ వీడియో చూసి అక్కినేని నాగార్జున కంటతడి పెట్టుకున్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘమైన నాగార్జున కెరీర్ లో ఎప్పుడూ ఇంతలా ఎమోషనల్ అవ్వడం ఫ్యాన్స్ చూడలేదు. కేవలం నాగార్జున ముఖం లో నవ్వు మాత్రమే చూస్తూ వచ్చిన ఫ్యాన్స్ , మొట్టమొదటి సారి ఎమోషనల్ అవ్వడాన్ని చూసి , వాళ్ళు కూడా బాగా ఎమోషనల్ అయిపోయారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
Again, the father & son got emotional. ❤️
This shows how much the success of #Lenin means to #NagarjunaAkkineni and #AkhilAkkineni.pic.twitter.com/QzBbNAPH8U
— Telugu Chitraalu (@CineChitraalu) July 11, 2026
