spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu- Sreeleela: అదృష్టం ఆమెకు తేనెతుట్టులా పట్టింది... మహేష్ కి జంటగా పెళ్లి సందD...

Mahesh Babu- Sreeleela: అదృష్టం ఆమెకు తేనెతుట్టులా పట్టింది… మహేష్ కి జంటగా పెళ్లి సందD శ్రీలీల?

Mahesh Babu- Sreeleela: కొంత మంది హీరోయిన్స్ ని చూస్తే అదృష్టానికి నిలువెత్తు నిదర్శనంలా ఉంటారు. ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఆఫర్స్ ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడతాయి. దర్శక నిర్మాతలు వాళ్ళ వెనకబడుతుంటారు. కెరీర్ బిగినింగ్ లోనే స్టార్స్ తో ఆఫర్స్ పట్టేస్తారు. ఈ జనరేషన్స లో సమంత, రష్మిక, కృతి శెట్టి ఈ కేటగిరీకి చెందినవారు. తాజాగా ఈ లిస్ట్ లో శ్రీలీల చేరే సూచనలు కనిపిస్తున్నాయి. కన్నడ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ ని ఏలేసేలా ఉంది. ఆమె కొన్ని క్రేజీ ఆఫర్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Mahesh Babu- Sreeleela
Mahesh Babu- Sreeleela

శ్రీలీల పెళ్లిసందD మూవీతో తెలుగులో అడుగుపెట్టారు. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. అయితే తన గ్లామర్ తో తెలుగు మేకర్స్ ని ఆకర్షించింది. ప్రస్తుతం శ్రీలీల రవితేజకు జంటగా ధమాకా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం విడుదల కాకుండానే శ్రీలీలకు భారీ ఆఫర్ తగిలినట్లు తెలుస్తుంది. ఏకంగా మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిందట. దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ కి జంటగా శ్రీలీలను ఎంపిక చేశారట.

మహేష్ 28 మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కథ రీత్యా సెకండ్ హీరోయిన్ ఉంటుందట. ఆ ఛాన్స్ త్రివిక్రమ్ శ్రీలీలకు ఇచ్చాడట. శ్రీలీల సూపర్ స్టార్ పక్కన జతకట్టడం దాదాపు ఖాయమే అంటున్నారు. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ తన మార్క్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అలాగే ఫస్ట్ టైం తన మూవీలో మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం హాట్ బాలీవుడ్ ఫిగర్ ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారట.

Mahesh Babu- Sreeleela
Mahesh Babu- Sreeleela

ఈ ప్రాజెక్ట్ ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. అయితే మరలా స్క్రిప్ట్ లో మార్పులు చేసిన నేపథ్యంలో ఆ షెడ్యూల్ వృద్దా అయినట్లే అన్న వాదన వినిపిస్తోంది. సినిమా రెగ్యులర్ షూట్ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారట. డిసెంబర్ మొదటి వారంలోనే మహేష్ ఈ ప్రాజెక్ట్ షూట్ లో పాల్గొంటారని తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని ఎంచుకున్నారు. ఆయన్ని తప్పిస్తున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరోయిన్ శోభన నటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper