spot_img
Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna: మోసం కాదు పరస్పర అవగాహనతో విడిపోతున్నాం... రష్మిక మందాన షాకింగ్ ప్రకటన

Rashmika Mandanna: మోసం కాదు పరస్పర అవగాహనతో విడిపోతున్నాం… రష్మిక మందాన షాకింగ్ ప్రకటన

Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందాన మోసపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. ఎప్పటి నుండో ఆమె వద్ద మేనేజర్ గా పని చేస్తున్న వ్యక్తి ఏకంగా రూ. 80 లక్షలు కాజేశాడని సమాచారం. వృతిపరంగా బిజీగా ఉన్న రష్మిక మేనేజర్ పై పూర్తి విశ్వాసం ఉంచారట. డేట్స్, అకౌంట్స్ వంటి కీలక విషయాలు అప్పగించారట. దీంతో అదును చూసి మేనేజర్ దెబ్బేశాడట. పెద్ద మొత్తంలో రష్మిక మందాన డబ్బులు కొట్టేశాడట. ఈ మేరకు మీడియా కోడై కూసింది. ఈ వార్తలపై రష్మిక మందాన స్పందించారు.

ప్రచారం అవుతున్నట్లు ఎలాంటి మోసం జరగలేదు. నా మేనేజర్ డబ్బులు దొంగిలించలేదు. మేము పరస్పర అవగాహనతో విడిపోయాం. మేము ప్రొఫెషనల్స్. ఎవరి కెరీర్లో వారు మరింత ఎదగాలని కోరుకుంటాము. అందుకే ఆయన నా వద్ద నుండి వెళ్లిపోయారు. ఇందులో ఎలాంటి వివాదం లేదని తేల్చేశారు. ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తిని సడన్ గా తొలగించడంతో అనుమానాలు బలపడ్డాయి. ఇప్పుడు రష్మిక చెప్పేది కూడా అబద్ధం కావచ్చని కొందరి అభిప్రాయం.

ఇక తెలుగులో రష్మిక పుష్ప 2లో నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఈ చిత్ర దర్శకుడు. ఈ క్రేజీ సీక్వెల్ పై ఇండియా వైడ్ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ఏడాది చివర్లో పుష్ప 2 విడుదలయ్యే అవకాశం కలదు. ఇక పుష్ప 2లో రష్మిక పాత్ర చనిపోతుందనే ప్రచారం జరుగుతుంది. సీక్వెల్ లో రష్మిక పాత్ర నిడివి సుకుమార్ తగ్గించారనే వాదన కూడా ఉంది.

దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. రష్మిక చేతిలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ యానిమల్. గ్యాంగ్ స్టర్ డ్రామాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. అసలు వైలెంట్ ఫిలిం అనే ఎలా ఉంటుందో చూపిస్తానని సందీప్ రెడ్డి వంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. అలాగే రైన్ బో టైటిల్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

YS Jagan

YS Jagan: జగన్ కు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్!

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పుంజుకునేందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. మరోవైపు పార్టీ నేతలకు కేసులు...
Tanuja

Tanuja: ‘అతని వల్లే ఈరోజు కళ్యాణ్ పడాల సేఫ్ గా ఉన్నాడు’ అంటూ ‘బిగ్ బాస్ 9’ ఫేమ్...

Tanuja: గత ఏడాది ప్రసారమైన 'బిగ్ బాస్ 9' షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ కే...
Andhra Pradesh Gold Mines

Andhra Pradesh Gold Mines: ఏపీకి బంగారం లాంటి వార్త!

Andhra Pradesh Gold Mines: జాతీయస్థాయిలో ఏపీ భరోసారీ ప్రత్యేక గుర్తింపు పొందింది.'గోల్డెన్' ఛాన్స్ దక్కించుకుంది.. రాయలసీమలో మరో జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న చిత్తూరులో...
Tollywood Heroes

Tollywood Heroes: దేశంలో ఇంత జరుగుతున్న మన స్టార్ హీరోల మౌనం వెనక కారణం…

Tollywood Heroes: ప్రస్తుతం ఇండియాలో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి...NEET ఎగ్జామ్ పేపర్ లీకేజి కారణం గా డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వాళ్ల మీద పోలీసులు...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవికి కూటమి కీలక బాధ్యతలు!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కూటమి ప్రభుత్వం పెద్ద ఆఫర్ చేసిందా? పెద్ద బాధ్యత ఆయనపై మోపిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది....
Oktelugu Epaper