spot_img
Homeఎంటర్టైన్మెంట్Skylab Movie: సత్యదేవ్ "స్కైలాబ్" చిత్రానికి సెన్సార్ పూర్తి...

Skylab Movie: సత్యదేవ్ “స్కైలాబ్” చిత్రానికి సెన్సార్ పూర్తి…

Skylab Movie: ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య, తిమ్మరసు వంటి సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. వరుస ప్రయోగాలను చేసి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా సత్యదేవ్, నిత్యామేనన్​, రాహుల్​ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా స్కైలాబ్. విశ్వక్​ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంను డాక్టర్ కే రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫీచర్స్, నిత్యామీనన్ కలిసి నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు విడుదలై ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్​, టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.

actor satyadev skylab movie completed censor certification

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ రావడం విశేషం అని చెప్పాలి. డిసెంబర్ 4 వ తేదీన విడుదల అవుతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది. ఈ మూవీ ప్రి రిలీజ్ వేడుకకి నేచురల్ స్టార్ నాని స్పెషల్ గెస్ట్ గా రానున్నారు.

1979 సంవ‌త్సరంలో మన తెలుగు రాష్ట్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో కొన్ని విచిత్ర‌మైన ప‌రిస్థితులు జరిగాయి. అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురు చూడసాగారు. వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్‌ చేశాయి. ఈ నేప‌థ్యంలో ఆ గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్‌, రామారావుల జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Oktelugu Epaper