Kingdom Movie : ఈ నెల 31 వ తేదీన విడుదల కాబోతున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం పై మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక స్టార్ హీరో సినిమా విడుదల అంటే ఎలా ఉంటుందో, ఈ సినిమా విడుదలకు కూడా అదే రేంజ్ హైప్, క్రేజ్ ఉంది. ఉదాహరణకు నేడు ఉదయం ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. షెడ్యూల్ చేసిన షోస్ చాలా తక్కువే,కానీ అప్పుడే 5 వేల డాలర్లకు పైగా గ్రాస్ నమోదు అయ్యింది. మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఇది ది బెస్ట్ ట్రెండ్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అది కాసేపు పక్కన పెడితే ఈ సినిమా నుండి ఇప్పటికే ఒక పాట విడుదలై యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
అనిరుద్(Anirudh Ravinchander) నుండి ఒక పాట వస్తుందంటే కచ్చితంగా సూపర్ హిట్ అనే అంచనాలు ఉంటాయి. కానీ ఈ పాట ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. అయితే కాసేపటి క్రితమే ‘అన్న అంటే’ అనే పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘మర్చిపోడానికి వాడేమైనా గోడ మీద ఉన్న దేవుడా..? గుండెల్లో ఉన్న అన్నవాడు’ అంటూ విజయ్ దేవరకొండ డైలాగ్ తో ఈ సాంగ్ మొదలు అవుతుంది. ఈ ప్రోమో లో విజువల్స్ ని చూస్తుంటే ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్య ఎమోషన్స్ పీక్ రేంజ్ లో ఉండేట్టుగా అనిపిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ కి అన్నయ్య సత్యదేవ్ నటించాడు. చాలా కాలం తర్వాత ఆయనకు ఈ సినిమా ద్వారా మంచి క్యారక్టర్ దొరికినట్టు అనిపించింది. ఈ పాటని కూడా అనిరుద్ నే పాడాడు.
సినిమాలోని పాటలన్నీ ఆయనే పాడినట్టుగా అనిపిస్తుంది. ఇది కచ్చితంగా ఈ చిత్రం పై హైప్ పెంచే ఎలిమెంట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. అదే విధంగా రిలీజ్ డేట్ ప్రోమో లో వచ్చే పాటకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓవరాల్ గా అనిరుద్ రేంజ్ ఆల్బం అని చెప్పలేము కానీ, ఒక డీసెంట్ స్థాయి ఆల్బుమ్ అని మాత్రం చెప్పగలం. ఇక ఒక సినిమా పైకి లేవాలంటే కచ్చితంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉండడం అత్యంత కీలకం. ఆ విషయం లో అనిరుద్ గురించి ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ‘దేవర’ సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందుకు కారణం అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా. కచ్చితంగా ఈ సినిమాని కూడా అనిరుద్ పైకి లేపుతాడని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్.