Homeఎంటర్టైన్మెంట్Actor Naga Anvesh:పెళ్ళికి రెడీ అయిన హీరో.. అమ్మాయి ఎవరంటే.. ?

Actor Naga Anvesh:పెళ్ళికి రెడీ అయిన హీరో.. అమ్మాయి ఎవరంటే.. ?

Actor Naga Anvesh: యంగ్ హీరో నాగ అన్వేష్ ఏంజెల్ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. అయితే, ఈ ప్రతిభావంతుడైన యువ నటుడు త్వరలోనే ఓ ఇంటివాడు కావడానికి సన్నద్ధం అయ్యాడు. నాగ అన్వేష్ మనసుకు నచ్చిన అమ్మాయితో అతని వివాహ నిశ్చితార్థం శనివారం అంగరంగవైభవంగా జరిగింది.   కాగా హైదరాబాద్‌లో ప్రైవేట్ ఈవెంట్‌గా జరిగిన నాగ అన్వేష్ ఎంగేజ్‌మెంట్‌కు ఇరు కుటుంబాలతోపాటు స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయి తమ ఆశీస్సులను అందజేశారు. ఈ వేడుకకు […]

Actor Naga Anvesh: యంగ్ హీరో నాగ అన్వేష్ ఏంజెల్ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. అయితే, ఈ ప్రతిభావంతుడైన యువ నటుడు త్వరలోనే ఓ ఇంటివాడు కావడానికి సన్నద్ధం అయ్యాడు. నాగ అన్వేష్ మనసుకు నచ్చిన అమ్మాయితో అతని వివాహ నిశ్చితార్థం శనివారం అంగరంగవైభవంగా జరిగింది.

Actor Naga Anvesh
Actor Naga Anvesh

 

కాగా హైదరాబాద్‌లో ప్రైవేట్ ఈవెంట్‌గా జరిగిన నాగ అన్వేష్ ఎంగేజ్‌మెంట్‌కు ఇరు కుటుంబాలతోపాటు స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయి తమ ఆశీస్సులను అందజేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది కూడా.

Also Read: ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి గౌత‌మ్ రెడ్డి గుండెపోటుతో మృతి

ఇక ఈ వేడుక వివరాల్లోకి వెళితే.. నాగ అన్వేష్ కొంతకాలంగా తనకు సుపరిచతమైన కావ్య అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. అయితే, తమ ప్రేమ వ్యవహారాన్ని కావ్య, నాగ అశ్విన్ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకురాగా ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపాయి. దాంతో వారి లవ్ మ్యాటర్‌ సుఖాంతమైంది.

Actor Naga Anvesh
Actor Naga Anvesh

కావ్య తండ్రి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ కంపెనీ డైరెక్టర్ విజయ్ కుమార్ కావడం విశేషం. అలాగే నాగ అన్వేష్ తండ్రి సింధూర పువ్వు కృష్ణారెడ్డి అనే విషయం తెలిసిందే. నాగ అన్వేష్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే, నాగ అన్వేష్ త్వరలోనే మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. శ్రీ సరస్వతి ఫిల్మ్ బ్యానర్ పై ఆ సినిమా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

అన్నట్టు ఈ గ్రాఫిక్స్ హంగులతో ఉంటుందట. మరి ఈ సినిమాతోనైనా నాగ అన్వేష్ కి మంచి హిట్ వస్తోందేమో చూడాలి.

Also Read:  సమంత.. వన్యప్రాణుల మధ్య సేద తీరుతున్న దేవకన్య

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper