Homeఎంటర్టైన్మెంట్Shruti Hassan Lokesh kanagaraj: వామ్మో శృతిహాసన్.. డైరెక్టర్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది

Shruti Hassan Lokesh kanagaraj: వామ్మో శృతిహాసన్.. డైరెక్టర్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది

విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కలిసి శృతిహాసన్ ఓ మ్యూజిక్ వీడియో చేశారు. ఈ వీడియోలో లోకేష్, శృతి ప్రధాన పాత్రలో నటించారు. తమిళనాడులో లోకేష్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Shruti Hassan Lokesh kanagaraj: హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా.. సినిమాలు చేస్తోంది కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతిహాసన్. రీసెంట్గా సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గాయనిగా, నటిగా, రచయితగా శృతిహాసన్ మల్టీ టాలెంటెడ్. సంబంధాలు నెరపడంలోనూ శృతిహాసన్ దిట్టే. హీరో సిద్ధార్థ, హాలీవుడ్ నటుడుతో గతంలో ప్రేమయాణం నడిపినట్టు పుకార్లు వినిపించాయి. తాజాగా ఓ డూడుల్ ఆర్టిస్ట్ తో సహజీవనం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సరే విషయాలు పక్కనపెడితే.. చేతినిండా సినిమాలో ఉన్నప్పటికీ శృతిహాసన్ ఓ పేరు మోసిన డైరెక్టర్ తో రెచ్చిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

విక్రమ్ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కలిసి శృతిహాసన్ ఓ మ్యూజిక్ వీడియో చేశారు. ఈ వీడియోలో లోకేష్, శృతి ప్రధాన పాత్రలో నటించారు. తమిళనాడులో లోకేష్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల విజయ్ హీరోగా లియో అనే సినిమాను లోకేష్ రూపొందించాడు. ప్రస్తుతం మూడు చిత్రాలను లైన్ లో పెట్టాడు. అంత బిజీగా ఉన్నప్పటికీ శృతి తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ లో అదరగొట్టాడు. ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో లోకేష్ తో శృతి రెచ్చిపోయి కనిపించింది.

18 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో శృతిహాసన్, లోకేష్ కెమిస్ట్రీ చూడ్డానికి చాలా బాగుంది. ఇనిమెల్ అనే పేరు పెట్టిన ఈ పాట మార్చి 25న విడుదల కానుంది. ఈ పాటలో శృతి కురచ దుస్తుల్లో కనిపించింది. లోకేష్ తో అద్భుతమైన రొమాన్స్ పండించింది.. ఇక ప్రస్తుతం లోకేష్ రజనీకాంత్ తో ఒక సినిమా, సూర్యతో మరో సినిమా, ఖైదీ -2 సినిమాలకు కమిట్ అయ్యాడు. శృతిహాసన్ కూడా కొన్ని బాలీవుడ్ ప్రాజెక్టుల తో పాటు సలార్ -2 తో బిజీగా ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper