Homeక్రైమ్‌Italy: కంటైనర్ లో భారీగా డబ్బు.. దాని పక్కనే ఒక వాహనం ఆగింది.. ఆ తర్వాత...

Italy: కంటైనర్ లో భారీగా డబ్బు.. దాని పక్కనే ఒక వాహనం ఆగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Italy: మనలో చాలామందికి హాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ సినిమాల్లో దోపిడీలను చాలా రియాల్టీగా చూపిస్తుంటారు. సినిమా కాబట్టి దర్శకులు లిబర్టీ తీసుకుంటారు. తద్వారా ప్రేక్షకులు ఊహించని సంఘటనలను కళ్ళ ముందు ఉంచుతారు. ఆ క్షణం వరకు అదంతా జరుగుతోంది నిజమే అని ప్రేక్షకులు అనుకుంటారు. అందువల్లే హాలీవుడ్ సినిమాల్లో దోపిడీ సన్నివేశాలు విపరీతమైన ప్రాచుర్యం పొందాయి. హాలీవుడ్ సినిమాల్లో సన్నివేశాలు మాదిరిగానే బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా దోపిడీ తరహా దృశ్యాలను అనేక […]

Italy: మనలో చాలామందికి హాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ సినిమాల్లో దోపిడీలను చాలా రియాల్టీగా చూపిస్తుంటారు. సినిమా కాబట్టి దర్శకులు లిబర్టీ తీసుకుంటారు. తద్వారా ప్రేక్షకులు ఊహించని సంఘటనలను కళ్ళ ముందు ఉంచుతారు. ఆ క్షణం వరకు అదంతా జరుగుతోంది నిజమే అని ప్రేక్షకులు అనుకుంటారు. అందువల్లే హాలీవుడ్ సినిమాల్లో దోపిడీ సన్నివేశాలు విపరీతమైన ప్రాచుర్యం పొందాయి.

హాలీవుడ్ సినిమాల్లో సన్నివేశాలు మాదిరిగానే బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా దోపిడీ తరహా దృశ్యాలను అనేక సినిమాలలో రూపొందించారు. అయితే నిజ జీవితంలో ఆ తరహా దోపిడీ సంఘటనలు జరగడం చాలావరకు అరుదు. అటువంటి సంఘటన ఒకటి జరిగింది.

సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం ఇటలీ ప్రాంతంలో హాలీవుడ్ సినిమా స్థాయిలో దొంగతనం చోటుచేసుకుంది. డబ్బు తీసుకెళ్తున్న ఒక కంటైనర్ మీద దొంగలు దాడి చేశారు. ప్రధాన రోడ్డు మీదనే వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. చూస్తుండగానే కంటైనర్ ను వెంబడించారు. దాని పక్కనే ఒక వాహనాన్ని నిలిపివేశారు.

ఆ తర్వాత సాయుధులైన వ్యక్తులు మెయిన్ రోడ్డు మీద బాంబులు పేల్చారు. అక్కడి వాతావరణం మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. రోడ్డును మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత వాహనంలో ఉన్న డబ్బులు మొత్తం తస్కరించారు. అంతేకాదు పక్కనున్న రోడ్డు మీద కూడా బాంబులు పేల్చారు. ఇటలీ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. వాస్తవానికి ఇటలీలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని.. ప్రజలు అక్షరాస్యతను అధికంగా కలిగి ఉంటారని ప్రచారంలో ఉంది. ఈ సంఘటన చూసిన తర్వాత అదంతా అబద్ధమని.. ఇటలీలో కూడా దారిద్రం ఉందని.. అందువల్ల ఈ స్థాయిలో దొంగతనం జరిగిందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper