Homeక్రైమ్‌Chittoor: ఆమెకు 37.. 17 సంవత్సరాల బాలుడితో సంబంధం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Chittoor: ఆమెకు 37.. 17 సంవత్సరాల బాలుడితో సంబంధం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Chittoor: నైతికత అనే పదం నాశనం అవుతుంది. వ్యక్తుల మధ్య బంధాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రేమ అనేది ఒక ఇన్స్టంట్ వస్తువు లాగా మారిపోయింది. కలకాలం కలిసి ఉండాలనే ప్రతిజ్ఞ గాలి మాట అయిపోయింది. ఫలితంగా అనైతికమైన వ్యవహారాలు సాగుతున్నాయి. వయసుతో సంబంధంలేని బంధాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి కలయికతో కుటుంబ వ్యవస్థలు సంకనాకి పోతున్నాయి. చివరికి జరగకూడని దారుణాలు జరుగుతున్నాయి. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే భర్తను […]

Chittoor: నైతికత అనే పదం నాశనం అవుతుంది. వ్యక్తుల మధ్య బంధాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ప్రేమ అనేది ఒక ఇన్స్టంట్ వస్తువు లాగా మారిపోయింది. కలకాలం కలిసి ఉండాలనే ప్రతిజ్ఞ గాలి మాట అయిపోయింది. ఫలితంగా అనైతికమైన వ్యవహారాలు సాగుతున్నాయి. వయసుతో సంబంధంలేని బంధాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి కలయికతో కుటుంబ వ్యవస్థలు సంకనాకి పోతున్నాయి. చివరికి జరగకూడని దారుణాలు జరుగుతున్నాయి.

సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే భర్తను భార్య మోసం చేస్తోంది. భార్యను భర్త పట్టించుకోవడం లేదు. పిల్లలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అంతిమంగా కుటుంబ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ జనాలలో మార్పు రావడం లేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో దారుణాలకు పాల్పడుతున్నారు. సాటి మనిషి మీద ప్రేమ అనే స్థానంలో కసి పెంచుకుంటున్నారు. తమకంటే వయసులో చిన్న వారి మీద ప్రేమ చూపించాల్సిన చోట కామాన్ని పెంచుకుంటున్నారు. ఫలితంగా కుటుంబ వ్యవస్థలు అదుపుతప్పుతున్నాయి. మనుషులు పశువులకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా ఊహించని దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఓ వివాహిత ఉంది. ఈమెకు 37 సంవత్సరాలు. 17 సంవత్సరాల బాలుడితో ఈమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అంతేకాదు ఆ బాలుడి మీద విపరీతమైన వ్యామోహం పెంచుకుంది. అయితే ఇటీవల కాలంలో ఆమె వ్యవహారం భర్తకు తెలియడంతో నిలదీశాడు. అత్త కూడా మందలించింది. దీంతో వారిద్దరిని చంపడానికి ఆమె ప్లాంట్ రూపొందించింది.

చిత్తూరు జిల్లాలోని చామంతి పురం ప్రాంతానికి చెందిన కవిత (37) కు ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఆమెకు అదే ప్రాంతానికి చెందిన 17 సంవత్సరాల బాలుడితో అనుకోకుండా పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కవితకు 17 సంవత్సరాల క్రితమే వివాహం జరిగింది. ఆమెకు 15, 13 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఉన్నారు. కవిత వ్యవహారం తెలియడంతో ఆమె భర్త తీవ్రంగా మందలించాడు. అత్త కూడా తిట్టింది. దీంతో వారిద్దరి అడ్డు తొలగించుకోవడానికి.. చంపేయాలని ప్రణాళిక రూపొందించింది. అందువల్లే ఆ మైనర్ బాలుడిని రెచ్చగొట్టింది. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న నిర్మలపై ఆ బాలుడు దాడికి యత్నించాడు. నిర్మల కళ్ళల్లో కారంపొడి చల్లాడు. నిర్మల ఒక్కసారిగా అరవడంతో అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిర్మలపై దాడి చేసిన క్రమంలో ఆమె తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన జరిగిన తర్వాత కవిత పరారీలో ఉంది. ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఆతర్వాత అతడిని జువైనల్ హోమ్ కు తరలించారు. చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కవితను అదుపులోకి తీసుకున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper