Homeక్రైమ్‌Woman Cheats: అందమైన కిలాడి లేడి.. సంపన్న వర్గాలే లక్ష్యం.. వీడియోలు తీస్తుంది.. డబ్బులు డిమాండ్...

Woman Cheats: అందమైన కిలాడి లేడి.. సంపన్న వర్గాలే లక్ష్యం.. వీడియోలు తీస్తుంది.. డబ్బులు డిమాండ్ చేస్తుంది.. చివరికిలా దొరికింది..

Woman Cheats: సాధారణంగా ఈ కాలపు యువతులు తమ కలల్ని సాకారం చేసుకోవడానికి తీవ్రంగా కష్టపడుతుంటారు. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అనేకమార్గాలను అన్వేషిస్తున్నారు. చివరికి తమ లక్ష్యాలను సాధిస్తున్నారు. కానీ ఈ యువతి మాత్రం అందుకు పూర్తి విభిన్నం. పైగా ఈ కాలపు యువతులు చేయని ఆలోచన చేసింది. దుర్మార్గపు ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టింది. భారీగా డబ్బు సంపాదించి.. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఓ దరిద్రపు ఆలోచనకు శ్రీకారం చుట్టింది. తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకుంది. ముగ్గులోకి దింపడానికి ఏకంగా సరికొత్త ప్రణాళికలు అమలు చేయడం ప్రారంభించింది. ఫలితంగా అనేకమంది డబ్బున్న వాళ్లను బకరాలను చేసింది. వారి వద్ద ఉన్నది మొత్తం ఊడ్చి పడేసింది. దీంతో వారంతా ప్రస్తుతం పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బారులు తీరుతున్నారు. అ కిలాడి లేడి ఉదంతం బయటికి రావడంతో బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు.

ముమ్మరంగా దర్యాప్తు

ఈ కేసును భ్రంగా పరిగణించిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగానే ఆ యువతి పనిచేసే ఈ గ్యాంగ్ వలపు వల విసిరిందని తెలుస్తోంది. దీని వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. డిజిటల్ మార్కెటింగ్ పేరుతో డబ్బున్న యువకులను పరిచయం చేసుకొని.. ఇలాంటి పనులు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే ఆ కిలాడి వేధింపుల వల్ల ఓ యువకుడు ఏకంగా ఒడిశా పారిపోయాడని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఆ యువతి బెదిరించిన ప్రతిసారి అతడు లక్షల్లో సమర్పించుకున్నాడట. దీంతో పోలీసులు ఆమె ఆన్లైన్ లావాదేవీలపై దృష్టి సారించారు. నగదు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. హైదరాబాదులోని పలువురు యువకుల్ని కూడా ఆ యువతి వలలో పడేసిందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ పోలీసులకు విశాఖ కమిషనర్ ఆఫ్ పోలీస్ బాగ్చి ఇప్పటికే ఈ కేసు కు సంబంధించి కీలక సమాచారాన్ని తెలియజేశారు. నిందితురాలి బ్యాంకు ఖాతాలోని నగదు నిలుపుదల చేశారు. అయితే ఆ యువతి వలలో చాలామంది చిక్కుకుపోయారని తెలుస్తోంది.

శారీరక సంబంధం

సాధారణంగా వలపు వల అనేది ఒక కోణం వరకే జరిగిపోతుంది. కానీ ఆ మాయలోడి ఎపిసోడ్ లో వలపు వల సరికొత్త పంథా లో సాగింది. ముందుగా ఫోన్ చేయడం.. ఆ తర్వాత కవ్వించేలాగా మాట్లాడటం.. అనంతరం శారీరక సంబంధం పెట్టుకోవడం.. ఆ వ్యవహారాన్ని రహస్యంగా కెమెరాలో చిత్రీకరించడం.. ఆ తర్వాత బెదిరించడం.. లక్షలకు లక్షలు లాగడం వంటివి మాత్రమే కాకుండా.. పెళ్లి చేసుకుందాం అనే ప్రపోజల్ కూడా కొనసాగించిందని తెలుస్తోంది.. అయితే ఆ యువతి పెళ్ళికాని ప్రసాద్ లనే టార్గెట్ గా చేసుకొని ఈ వ్యవహారం సాగించిందని తెలుస్తోంది. ఆ ముసుగు సుందరి మాయలో పడిన ఓ ఎన్ఆర్ఐ.. సర్వం సమర్పించుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.. విశాఖలోని షీలా నగర్ ప్రాంతానికి చెందిన అతడు.. విదేశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. జిగేల్ రాణి మాయమాటలకు పడిపోయాడు. ఆ తర్వాత ఆమె కోసం స్వదేశానికి వచ్చాడు. ఆమె చెప్పిన ప్లేస్ కు వెళ్లాడు.. శారీరకంగా కలిశాడు. ఆ తర్వాత ఆ వీడియోలతో ఆ ముసుగు సుందరి బెదిరించడం మొదలుపెట్టింది. దీంతో అతడు లక్షలకు లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ వేధింపులు ఆగపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కిలేడి ఆ యువకుడి తల్లిదండ్రులతోనూ ఫోన్లో మాట్లాడేది. కానీ ఇప్పుడు అసలు విషయం తెలియడంతో వారు లబోదిబో అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular