Uttar Pradesh : అది ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా లోని మధుర ప్రాంతం. అక్కడ ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ మహిళ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమె పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతుంటారు. ఆమె బోధించే సబ్జెక్టు లో ఓ విద్యార్థి వెనుకబడి ఉన్నాడు. దీంతో ఆమె తన ఇంటి వద్ద అతడికి ప్రైవేట్ పాఠాలు చెబుతోంది. టీచర్ చెబుతున్న పాఠాలు వినకుండా.. ఆ విద్యార్థి వేరే విధంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ ఉపాధ్యాయురాలు ఏదో పనిలో ఉండగా అతడు వీడియో తీశాడు. అది చూడ్డానికి అత్యంత అశ్లీలంగా ఉంది. దీనిని చూపిస్తూ అతడు ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. అతని వ్యవహార శైలి నచ్చక.. ఆ ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థికి పాఠాలు చెప్పడం మానేసింది. అతడితో మాట్లాడటం దాదాపుగా తగ్గించింది. దీంతో అతడు కోపంతో రగిలిపోయాడు.
టీచర్ అశ్లీల వీడియోను..
టీచర్ అశ్లీల వీడియోను తన ఫోన్ ద్వారా తోటి విద్యార్థులకు పంపించాడు. అలాగే వాట్స్అప్ ద్వారా మరికొంతమందికి షేర్ చేశాడు. వారంతా కలిసి ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా ఒక పేజీ రూపొందించారు. ఇది ఆ ఉపాధ్యాయురాలికి తెలిసింది. గత్యంతరం లేక తన బాధను మిషన్ శక్తి అభియాన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఆ విద్యార్థి చేసిన పనికి తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని బాధపడింది. మిషన్ శక్తి అభియాన్ కేంద్రం వారు ఉపాధ్యాయురాలికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారు ఇచ్చిన మద్దతుతో ఆ ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ విద్యార్థులు మైనర్లా? కాదా? అనే విషయాన్ని పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. అయితే ఈ సంఘటన మధుర ప్రాంతంలో సంచలనం సృష్టించింది.. చదువులో వెనుకబడి ఉన్నాడని.. అతడు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయురాలు దయతలచి పాఠాలు చెబితే.. అతడు ఏకంగా ఆమెతో పడక సుఖం పంచుకోవాలని అనుకోవడం.. ఆమెను అశ్లీలంగా ఉన్నప్పుడు వీడియో తీయడం.. దాంతో బెదిరించడం వంటి పరిణామాలు ఉపాధ్యాయ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ విషయం పట్ల ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత ఉపాధ్యాయురాలికి సంఘీభావం ప్రకటించింది. ఇదే సమయంలో ఈ ఘటనకు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A student harassed a private tuition teacher in uttar pradesh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com