spot_img
Homeబిజినెస్Volkswagen : దేవుడా ఇంత మంచి ఆఫరా.. ఈ మోడల్ పై ఏకంగా 2.5లక్షల డిస్కౌంట్

Volkswagen : దేవుడా ఇంత మంచి ఆఫరా.. ఈ మోడల్ పై ఏకంగా 2.5లక్షల డిస్కౌంట్

Volkswagen : జర్మనీ చెందిన కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తన కస్టమర్లకు భారీ శుభవార్తను అందించింది. ఫోక్స్‌వ్యాగన్ తమ రెండు కార్లైన ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లపై రూ. 2.5 లక్షల వరకు ప్రయోజనాలను అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా, కంపెనీ వినియోగదారులకు 4 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీని, ఫోక్స్‌వ్యాగన్ పోలో కార్ల యజమానులకు రూ.50 వేల లాయల్టీ బెనిఫిట్‌ను కూడా అందిస్తోంది. దీనితో పాటు ఫోక్స్‌వ్యాగన్ స్క్రాపేజ్ బెనిఫిట్‌ను కూడా అందజేయనుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్
ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జీటీ లైన్ 1.0-లీటర్ టీఎస్‌ఐ ఏటీపై రూ.83,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వర్టస్ జీటీ ప్లస్ స్పోర్ట్ 1.5 లీటర్ టీఎస్‌ఐ డీఎస్‌జీపై రూ.1.35 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ క్రోమ్ హైలైన్ 1.0 లీటర్ టీఎస్‌ఐ ఏటీపై రూ. 1.90 లక్షల వరకు ప్రయోజనాన్ని అందిస్తుంది. అలాగే, టాప్‌లైన్ 1.0 లీటర్ టీఎస్‌ఐ ఏటీ మోడల్‌పై రూ.1.87 లక్షల వరకు ప్రయోజనం ఉంది. వర్టస్ జీటీ ప్లస్ క్రోమ్ 1.5 లీటర్ టీఎస్‌ఐ డీఎస్‌జీపై కూడా రూ.1.29 లక్షల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రారంభ ధర రూ.11.56 లక్షలు కాగా, టాప్ మోడల్ ధర రూ.19.40 లక్షల వరకు ఉంటుంది.

Also Read : ఉక్కు కంటే స్ట్రాంగ్ బాడీ ఉన్న ఎస్ యూవీ బుకింగ్స్ షురూ.. డెలివరీ ఎప్పుడంటే ?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ జీటీ లైన్ 1.0 లీటర్ టీఎస్‌ఐ ఏటీపై రూ.1.45 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ 1.5 లీటర్ టీఎస్‌ఐ డీఎస్‌జీపై రూ.2 లక్షల వరకు బెనిపిట్ అందిస్తుంది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ హైలైన్ 1.0 లీటర్ టీఎస్‌ఐ ఏటీపై రూ.2.5లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తుంది. టాప్‌లైన్ 1.0 లీటర్ టీఎస్‌ఐ ఎంటీపై రూ.2.36 లక్షల వరకు బెనిఫిట్ పొందవచ్చు. జీటీ ప్లస్ క్రోమ్ 1.5 లీటర్ టీఎస్‌ఐ డీఎస్‌జీపై కస్టమర్లు రూ. 2.39లక్షల వరకు లాభం పొందగలరు. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బేస్ మోడల్ ధర రూ. 11.70 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్ ధర ఎక్స్ షోరూమ్ ప్రకారం రూ.21.10లక్షల వరకు ఉంటుంది.

బుకింగ్ ప్రారంభం
ఫోక్స్‌వ్యాగన్ భారతీయ మార్కెట్‌లో టిగువాన్ ఆర్-లైన్ (Tiguan R-Line) కోసం ప్రీ-బుకింగ్స్ మొదలు పెట్టింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‎యూవీ ఏప్రిల్ 2025లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్‌లో 2.0-లీటర్ టీఎస్‌ఐ ఇంజన్‌ అమర్చారు. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ టర్బో-చార్జ్డ్ ఫోర్-సిలిండర్ ఇంజన్ 190 బీహెచ్‌పీ పవర్, 320 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టిగువాన్ ఆర్-లైన్ ఫీచర్లు
టిగువాన్ ఆర్-లైన్‌ను బ్లాక్ రంగు గ్రిల్, ఫ్రంట్ బంపర్, సైడ్ సిల్స్, ట్రిమ్, లోయర్ క్లాడింగ్‌ స్పెషల్ గా ఉంచుతాయి. ఇది ప్రత్యేకమైన ఆర్-లైన్ బ్యాడ్జింగ్‌తో వస్తుంది. ఇందులో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ ఛానెల్స్ ఉన్నాయి. ఈ SUVలో 19-ఇంచుల అల్లాయ్ వీల్స్, ఆల్-సీజన్ టైర్లు, బ్లాక్ రూఫ్ రైల్, పవర్-అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఎల్‌ఈడీ లైటింగ్ ఉన్నాయి. టిగువాన్‌లో వీటితో పాటు రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, రిమోట్-కంట్రోల్ పవర్ లిఫ్ట్‌గేట్ కూడా ఉన్నాయి.

Also Read : వోక్స్ వ్యాగన్ పై భారీ టాక్స్ చోరీ ఆరోపణలు..బాంబే హైకోర్టులో కేసు.. అసలేం జరిగింది ?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper