Volkswagen: ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India) తమ కొత్త SUV అయిన టిగువాన్ ఆర్ లైన్ (Tiguan R-Line) కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ఈ ప్రీమియం SUV స్పోర్టీ డిజైన్‌తో పాటు పవర్ ఫుల్ పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. భారతీయ మార్కెట్‌లో ఫోక్స్‌వ్యాగన్ నుంచి వస్తున్న ఈ కొత్త లాంచ్ కోసం ఆటోమొబైల్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టిగువాన్ ఆర్-లైన్ పెర్ఫార్మెన్స్, ఫీచర్లు
కొత్త టిగువాన్ ఆర్-లైన్ 2.0 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 204ps పవర్, 320ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV 4 మోషన్ ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది ఎలాంటి రోడ్లపై అయినా అద్భుతమైన పట్టు, స్థిరత్వాన్ని అందిస్తుంది.
సైజ్, డిజైన్:
ఈ SUV ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. దీని డైమెన్షన్‌ల గురించి మాట్లాడితే.. దీని పొడవు 4539ఎంఎం, వెడల్పు 1859ఎంఎం, ఎత్తు 1656ఎంఎం, వీల్‌బేస్ 2680ఎంఎం. కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. కొత్త టిగువాన్ ఆర్-లైన్ స్పోర్టీ ఆర్-ప్రేరేపిత డిజైన్, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్, టెక్నాలజీ, మంచి పర్ఫామెన్స్ కోసం పవర్ ఫుల్ ఇంజిన్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా Q2 2025లో గోల్ఫ్ GTI Mk 8.5ను భారతీయ మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఫోక్స్‌వ్యాగన్ నుంచి అత్యంత పవర్ ఫుల్ గోల్ఫ్ GTI అవుతుంది. ఇది ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
బుకింగ్ ఎక్కడ, ఎలా చేయాలి?
మీరు ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్ కొనుగోలు చేయాలనుకుంటే, మీరు ఏదైనా ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ప్రీ-బుక్ చేసుకోవచ్చు.
బ్రాండ్ డైరెక్టర్ ఏం చెప్పారు?
ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ.. టిగువాన్ ఆర్-లైన్ భారతీయ వినియోగదారులకు అద్భుతమైన SUV అవుతుంది.ఇది అద్భుతమైన పనితీరు, విశాలమైన స్పేస్, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుందని తెలిపారు.