Homeబిజినెస్Skoda Recall : 47000కార్లను రీకాల్ చేసిన స్కోడా.. లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో ?

Skoda Recall : 47000కార్లను రీకాల్ చేసిన స్కోడా.. లేకపోతే ఎంత ప్రమాదం జరిగేదో ?

Skoda Recall : భారతదేశంలో తయారైన తమ కార్లలో సీటు బెల్టుల సమస్యను గుర్తించిన స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. స్కోడాకు చెందిన కైలాక్, స్లావియా, కుషాక్‌తో పాటు ఫోక్స్‌వ్యాగన్‌కు చెందిన టైగన్, వర్టస్ మోడళ్లను కంపెనీ రికాల్ చేసింది. వెనుక సీటు బెల్టుల్లో లోపం ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM)కు కంపెనీ తెలియజేసింది. ప్రతి కారులోని వెనుక సీటు బెల్టుకు సంబంధించిన సమస్య వల్లే ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

Also Read : కొత్త స్కోడా కొడియాక్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఈ రీకాల్ వల్ల దాదాపు 47,000 యూనిట్లకు పైగా కార్లు ప్రభావితం కానున్నాయి. వీటిలో ఫోక్స్ వ్యాగన్ టైగన్, వర్టస్ 21,513 యూనిట్లు, అలాగే స్కోడా కైలాక్, స్లావియా, కుషాక్ లకు చెందిన 25,722 యూనిట్లు ఉన్నాయి. ఈ కార్లన్నింటినీ 2024 మే 24 నుండి 2025 ఏప్రిల్ 1 మధ్య కాలంలో తయారు చేశారు. దేశీయ, ఎగుమతి మార్కెట్ల కోసం మహారాష్ట్రలోని చాకన్‌లో ఉన్న కంపెనీ ప్లాంట్‌లో ఈ కార్ల ఉత్పత్తి జరిగింది.

కంపెనీ గుర్తించిన లోపం ఇదే
ఈ మోడళ్లలో వెనుక సీటు బెల్టు బకిల్ లాచ్ ప్లేట్‌లో లోపం ఉందని కంపెనీ తెలిపింది. ఒక వేళ ఏదైనా వాహానం ఈ వెహికల్ ను ముందు నుంచి ఢీకొన్నప్పుడు విరిగిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా, వెనుక మధ్య సీటు బెల్టు అసెంబ్లీ వెబ్బింగ్, వెనుక కుడి సీటు బెల్టు బకిల్‌తో ఫెయిల్ కావచ్చు. ఇది వెనుక సీట్లలో కూర్చున్న వ్యక్తుల సేఫ్టీకి ప్రమాదం కలిగిస్తుంది. కొనసాగుతున్న క్వాలిటీ టెస్టుల సమయంలో ఈ సమస్యను గుర్తించినట్లు కంపెనీ వెల్లడించింది.

ఉచితంగా రిపేర్ చేయనున్న కంపెనీ
వెనుక సీటు బెల్టుల్లోని ఈ లోపం వల్ల ఇప్పటివరకు ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదని స్కోడా-ఫోక్స్‌వ్యాగన్ కన్ఫాం చేయలేదు. అయితే ప్రభావిత వాహనాల కస్టమర్లను కంపెనీ సంప్రదిస్తోంది. తమ సర్వీసు సెంటర్లలో ఈ లోపాన్ని ఉచితంగా సరిచేస్తోంది. అంతేకాకుండా, కస్టమర్లు స్వయంగా సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి వారి కారు ఈ రీకాల్‌లో ఉందో లేదో తెలుసుకోవచ్చు. వినియోగదారులు వారి VIN (వాహన గుర్తింపు సంఖ్య)ను ఉపయోగించి స్కోడా, ఫోక్స్ వ్యాగన్ భారతీయ వెబ్‌సైట్‌లలోని రీకాల్ పేజీ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు.

Also Read : బంపర్ ఆఫర్.. అలా చేస్తే చాలు మీకు ఇష్టమైన రంగు కారు కొనుగోలు చేయవచ్చు

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular