Homeబిజినెస్Top 5 Electric Vehicles Sales in India: భారత దేశంలో టాప్ 5 EV...

Top 5 Electric Vehicles Sales in India: భారత దేశంలో టాప్ 5 EV ల విక్రయాలు ఏవి..?

Top 5 Electric Vehicles Sales in India: పెట్రోల్ ధరల కారణంతో పాటు.. పర్యావరణ కాలుష్యం విపరీతంగా ఎక్కువగా కావడంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి ఎక్కువగా రావడంతో వినియోగదారులు వీటి వైపే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి అమ్మకాలు పెరిగిపోతున్నాయి. 2026 ఫిబ్రవరి నెలలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు అత్యధికంగా జరుపుకున్నాయి. ఫెడరల్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్ (FADA) ప్రకారం.. ఒక నెలలోనే 13,733 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. 2025 ఫిబ్రవరి నెలతో పోలిస్తే 2026 ఫిబ్రవరి నెలలో 44.48 శాతం వృద్ధి అమ్మకాలు జరిగాయి. అయితే ఏ వాహనాలు ఎక్కువగా అమ్మకాలు జరుపుకుందో ఇప్పుడు చూద్దాం..

2026 ఫిబ్రవరి నెలలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో Tata కంపెనీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 5,568 వాహనాలను ఒక్క నెలలోనే విక్రయించింది. 2025 ఫిబ్రవరి నెలలో ఈ కంపెనీ 4,020 యూనిట్లు అమ్మింది. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 38.51 శాతం వృద్ధి సాధించింది.

EV ల విక్రయాల్లో JSW MG మోటార్స్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఈ కంపెనీ 2026 ఫిబ్రవరి నెలలో 3,313 యూనిట్లను వికలాలు చేసింది. 2025 ఇదే నెలలో 3,490 వాహనాలను సేల్స్ చేసింది. గత ఏడాదితో పోలిస్తే 5.10% తగ్గినట్టే తెలుస్తోంది.

మహీంద్రా కంపెనీ 2,913 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 2025 ఫిబ్రవరిలో 508 వాహనాలను మాత్రమే సేల్ చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ కంపెనీ 473.43% వృద్ధి సాధించడం విశేషం. మార్కెట్లో ఈ కంపెనీకి చెందిన EV లకు ఎక్కువ డిమాండ్ లభిస్తున్నట్లు మీ అమ్మకాలను చూస్తే తెలుస్తోంది.

భారతదేశంలోకి కొత్తగా అడుగుపెట్టిన Vinfast అనే కంపెనీ 384 యూనిట్లతో నాలుగో స్థానంలోకి వచ్చింది. అయితే ఇది ఇదే ఏడాది జనవరిలో 435 విక్రయాలు జరుపుకోగా.. ఫిబ్రవరి నెలలో మాత్రం 11.72% క్షీణ దశలో సేల్స్ చేసింది.

BYD కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు 2026 ఫిబ్రవరిలో 306 యూనిట్ లను సేల్స్ చేసింది. 2025 ఫిబ్రవరిలో ఈ కంపెనీ 278 వాహనాలను మాత్రమే విక్రయాలు చేసింది. భారతదేశంలో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో ఈ కంపెనీ ఐదో స్థానంలో నిలిచింది.

ఈ విధంగా దేశంలో ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ ను చూస్తే గత ఏడాది కంటే ఇప్పుడు వాహనాల వినియోగం ఎక్కువగా అవుతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు అవగాహన ఎక్కువగా రావడంతో పాటు కంపెనీలు నాణ్యమైన కార్లు మార్కెట్లోకి తీసుకురావడంతో చాలామంది వీటివైపు ఆకర్షితులు అవుతున్నారు. ముందు ముందు మరింత సేల్స్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular