Homeబిజినెస్Tata Punch EV: కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్

Tata Punch EV: కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్

Tata Punch EV: భారతదేశంలో కార్ల కంపెనీల్లో టాటా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ కంపెనీకి చెందిన కార్లు భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతారన్న భావన ఉంది. అందుకే సేప్టీ కార్లు కొనేవారికి ఈ కంపెనీ ది బెస్ట్ గా భావిస్తారు. అనుకున్నట్లుగానే టాటా కంపెనీ మరోసారి సేప్టీలో తనదైన ప్రతాపాన్ని చూపింది. దీని నుంచి మార్కెట్లోకి వస్తున్న కొత్త కారు టాటా పంచ్ ఈవీని భారత్ ఎన్‌సిఎపిలో క్రాష్ టెస్ట్ నిర్వహించింది. ఈ […]

Tata Punch EV: భారతదేశంలో కార్ల కంపెనీల్లో టాటా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ కంపెనీకి చెందిన కార్లు భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతారన్న భావన ఉంది. అందుకే సేప్టీ కార్లు కొనేవారికి ఈ కంపెనీ ది బెస్ట్ గా భావిస్తారు. అనుకున్నట్లుగానే టాటా కంపెనీ మరోసారి సేప్టీలో తనదైన ప్రతాపాన్ని చూపింది. దీని నుంచి మార్కెట్లోకి వస్తున్న కొత్త కారు టాటా పంచ్ ఈవీని భారత్ ఎన్‌సిఎపిలో క్రాష్ టెస్ట్ నిర్వహించింది. ఈ టెస్టులో ఈ కారు రేటింగ్ ఎంత పొందిందో తెలిస్తే షాక్ అవుతారు. మరి ఆ వివరాల్లోకి వెళ్దామా..

ఎలక్ట్రిక్ వేరియంట్ లో వచ్చే కొన్ని కార్లు సేప్టీ ఉంటాయా? అనే ఆందోళన చాలా మందిలో ఉంది. కానీ టాటా మోటార్స్ నుంచి వచ్చే పంచ్ ఈవీ మాత్రం అలా కాదని నిరూపించింది. ఈ కారుకు నిర్వహించిన టెస్ట్ లో పెద్దల రక్షణ విషయంలో అద్భుతమైన మార్కులను సాధించింది. మొత్తం 32 పాయింట్లకు గాను 31.09 పాయింట్లు సాధించి ప్రయాణికులకు ఇచ్చే అత్యుత్తమ భద్రత ఇచ్చే కారుగా నిలిచింది. ఎటువంటి ప్రమాదాల్లోనైనా ఈ కారు బాడీ షెల్ నిర్మాణం అత్యంత స్థిరంగా ఉన్నట్లు బి ఎన్‌సిఎపి నివేదిక వెల్లడించింది.

చిన్న పిల్లల భద్రత విషయంలోనూ పంచ్ ఏమాత్రం తగ్గలేదు. ఇందులో మొత్తం 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు దక్కించుకుంది. వెనుక సీట్లలో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు సరిగ్గా అమర్చడం, ఇంపాక్ట్ సమయంలో చైల్డ్ డమ్మీలపై తక్కువ ఒత్తిడి పడటంతో ఈ రక్షణ లభిస్తుంది. అయితే ఈ 5 స్టార్ రేటింగ్ కేవలం టాప్ మోడల్‌కే కాకుండా, పంచ్ ఈవీలో లభించే అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. కొనుగోలుదారులు ఏ వేరియంట్ ఎంచుకున్నా సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని బీ ఎన్‌సిఎపి స్పష్టం చేసింది.

అలాగే ఇందులో మరికొన్ని సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటివి రక్షణ ఇచ్చే అవకాశం ఉంది. act.ev ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన ఈ కారు బ్యాటరీ అడుగుభాగంలో ఉన్నప్పటికీ, ప్రమాదం జరిగినప్పుడు విద్యుత్ వ్యవస్థ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం కలిగించకుండా నిర్మాణాన్ని డిజైన్ చేశారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper