Homeబిజినెస్Samsung Galaxy S25 massive discount: Samsung Galaxy S25 పై భారీ తగ్గింపు.. ఫీచర్స్...

Samsung Galaxy S25 massive discount: Samsung Galaxy S25 పై భారీ తగ్గింపు.. ఫీచర్స్ తెలిస్తే వెంటనే కొంటారు..

Samsung Galaxy S25 massive discount: వినియోగదారుల అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇదే సమయంలో కొత్త రకమైన టెక్నాలజీని కోరుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం మొబైల్ తో ఉండేవారు.. ఈ విభాగంలో కొత్తగా మొబైల్ వచ్చిందంటే వాటికోసం ఎగబడుతారు. అయితే ఇదే సమయంలో కొన్ని కంపెనీలు కొన్ని పాత ఫోన్లపై ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఇవి మార్కెట్లోకి వచ్చిన సమయంలో కొనలేని వారు ఇలాంటి ఆఫర్లు ప్రకటించినప్పుడు కొనుగోలు చేయడం వల్ల తక్కువ ధరకే పొందవచ్చు. ప్రముఖ మొబైల్ కంపెనీ Samsung ఇటీవల Galaxy S26 మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే అంతకు ముందున్న Galaxy S25 ఫోన్ పై ఆఫర్ ప్రకటించింది. దీనిపై ఎలాంటి ఆఫర్ ఉందో ఇప్పుడు చూద్దాం..

Samsung Galaxy S25 గత ఏడాది మార్కెట్లోకి వచ్చింది. ఇది లాంచ్ అయిన సమయంలో రూ. 80,999 ధరగా నిర్ణయించారు. అయితే దీనిపై అమెజాన్ డిస్కౌంట్ ఇవ్వడంతో ప్రస్తుతం రూ. 74, 999 కే అందిస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ను ప్రకటించారు. HDFC బ్యాంకు క్రెడిట్ కార్డ్ పై రూ.3,500 అందిస్తోంది. దీంతో ఈ మొబైల్ ను రూ.71,499 ధరకే పొందవచ్చు. ఇప్పటివరకు ఉన్న అమెజాన్ ఆఫర్ తో కలిపి ఈ కొత్త ఆఫర్ కలిపి మొత్తం దాదాపు రూ.10,000 వరకు తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే కూడా ప్రత్యేక ఆఫర్ పొందే అవకాశం ఉంది.

Also Read: సూపర్ బ్యాటరీ.. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ ఫోన్ గురించి తెలిస్తే వెంటనే కొంటారు..

అయితే ఈ మొబైల్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ధర తగ్గించడంపై వినియోగదారుల్లో ఆసక్తి రేపుతుంది. ఇందులో 6.16 అంగుళాల AMOLED 2X డిస్ప్లే కలిగి ఉంది. ఈ డిస్ప్లేతో క్వాలిటీ మూవీస్ ఖచ్చితమైన రంగులతో చూడవచ్చు. గేమింగ్ కోరుకునే వారికి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 8 ప్రాసెసర్ ఉండడంతో.. మిగతా ఫోన్ల కంటే ఈ మొబైల్ ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఒకేసారి పలు రకాల యాప్స్ ఉపయోగించినా కూడా ఫోన్ వేగం తగ్గకుండా ఉంటుంది.

ప్రస్తుత కాలంలో చాలామంది మొబైల్ లో బ్యాటరీ గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు. నేటి తరం వారికి అనుగుణంగా ఇందులో 4,000 mAh బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 9 గంటల పాటు నిరంతరంగా వాడుకోవచ్చు. అలాగే ఈ బ్యాటరీ ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయడంతో బిజీగా ఉండే వారితో పాటు ఉద్యోగులకు అనుగుణంగా ఈ మొబైల్ వెంటనే చార్జింగ్ అవుతుంది. ఇక ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కెమెరా. ఈ మొబైల్లో 50 MP మెయిన్ కెమెరా ఉంది. అలాగే 10 MP ఆల్ట్రా వైడ్ సెన్సార్ ఉండడంతో లాంగ్ షాట్స్ కూడా resolution ఎక్కువగా ఉండే ఫోటోలు తీసుకోవచ్చు.12 MP తో సెల్ఫీ, వీడియో కాలింగ్ కు అనుగుణంగా ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాల ఫీచర్లు ఉన్న ఈ మొబైల్ తక్కువ ధరకే రావడంతో నేటి తరం వారికి ఇది బెస్ట్ ఎంపిక అని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular