OPPO Pad Mini Launch: మార్కెట్లోకి వచ్చే కొత్త గాడ్జెట్స్పై చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఇలాంటి వారికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ ను అందిస్తుంటాయి. ఇందులో భాగంగాOPPO కంపెనీకి చెందిన కొత్త PAD త్వరలో రాబోతోంది. దీనికి సంబంధించిన సమాచారం కంపెనీ అధికారికంగా ప్రకటించడంతో పాటు కొన్ని ఫోటోలు ఆన్లైన్లో రిలీజ్ కావడంతో ఈ ప్యాడ్ ఎలా ఉందో తెలిసిపోతుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 వంటి ప్రాసెసర్ తో పాటు మూవీస్, గేమింగ్ కోరుకునే వారికి అద్భుతంగా డిస్ప్లే ను అమర్చినట్లు తెలుస్తోంది. ఈ ప్యాడ్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
OPPO కంపెనీకి చెందిన ప్యాడ్ మినీ ఏప్రిల్ 21న చైనాలో లాంచ్ కాబోతుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనితోపాటు ప్యాడ్ 5 ప్రో ను కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఒప్పో ప్యాడ్ మినీ స్పెసిఫికేషన్స్ గురించి తెలిసి చాలామంది ఇంప్రెస్ అవుతున్నారు. కంపెనీ తెలిపిన ప్రకారం ఇందులో 3.32 GH2 బేస్ ఫ్రీక్వెన్సీ తో ఆక్తా కోర్ ఉండనుంది. ఇది 3.80 GHz వద్దా పనిచేస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉండనుంది. అలాగే ఇందులో 12gb వరకు ర్యామ్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధార్ కార్డ్ యూజర్ ఇంటర్ఫేస్ పై నడిచే ఈ ట్యాబ్ లో 8.8 అంగుళాల LTPO OLED డిస్ప్లేను ఉంచారు. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది.
మొబైల్ లో లాగే ఈ ప్యాడ్ మినీ లోను అద్భుతమైన కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇందులో స్లిమ్ జేజేల్స్ తో కెమెరాలు అమర్చారు. దీంతో నాణ్యమైన ఫోటోలను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. 8000 mAh కెపాసిటీ గల బ్యాటరీ ఉండడంతో ఎక్కువసేపు నిల్వ ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ టాబ్లెట్ 5.39 మిల్లీమీటర్ల మందం తో పాటు 279 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. దీంతో దీనిని చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. ఇది మార్కెట్లోకి వస్తే ధర రూ.19,990 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ 21న ఇది చైనాలో లాంచ్ కానుంది. ఆ తర్వాత దీనిని ఇండియాలోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. మొబైల్ కు ప్రత్యామ్నాయంగా అద్భుతమైన డిస్ప్లే కావాలని కోరుకునేవారు దీనిని కొనుగోలు చేయవచ్చని అంటున్నారు.