Homeఆంధ్రప్రదేశ్‌Apple Farming In Rayalaseema: జమ్మూ కాశ్మీర్ గా మారిపోయిన రాయలసీమ.. ఏకంగా ఆపిల్ పంటను...

Apple Farming In Rayalaseema: జమ్మూ కాశ్మీర్ గా మారిపోయిన రాయలసీమ.. ఏకంగా ఆపిల్ పంటను పండిస్తున్న రైతు..

Apple Farming In Rayalaseema: మనదేశంలో అత్యంత తక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో మొదటి స్థానంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్.. రాయలసీమ రెండవ స్థానంలో ఉంటుంది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి ఇక్కడ రికార్డు అవుతుంటాయి. అటువంటి రాయలసీమలో మామూలు పంటలు పండడమే చాలా కష్టం. అటువంటిది ఇక్కడ ఆపిల్ పంట సాగవుతోంది. మనదేశంలో హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్లో మాత్రమే ఆపిల్ పంట పండుతుంది. ఎందుకంటే ఈ పంటకు అతి స్వల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు […]

Apple Farming In Rayalaseema: మనదేశంలో అత్యంత తక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో మొదటి స్థానంలో రాజస్థాన్ రాష్ట్రంలోని జై సల్మీర్.. రాయలసీమ రెండవ స్థానంలో ఉంటుంది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి ఇక్కడ రికార్డు అవుతుంటాయి. అటువంటి రాయలసీమలో మామూలు పంటలు పండడమే చాలా కష్టం. అటువంటిది ఇక్కడ ఆపిల్ పంట సాగవుతోంది. మనదేశంలో హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్లో మాత్రమే ఆపిల్ పంట పండుతుంది. ఎందుకంటే ఈ పంటకు అతి స్వల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. కానీ విపరీతమైన ఎండ.. తక్కువ వర్షపాతం నమోదయ్యే రాయలసీమలో ఆపిల్ పంట పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఈ రైతు.

రాయలసీమలోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మోర్తాడ గ్రామానికి చెందిన రమణారెడ్డి ఔత్సాహిక రైతు. గతంలో ఈయన తన వ్యవసాయ భూమిలో వరి, వేరుశనగ, బత్తాయి, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, లిచి, లాంగన్ వంటి పంటలు సాగు చేశారు. వీటి సాగులో పెట్టుబడి విపరీతంగా కావడంతో రమణారెడ్డికి నష్టాలు ఎదురయ్యాయి.

తెలిసిన వాళ్ళ సలహాతో తన భూమిలో ఆపిల్ పంటను సాగు చేయడం మొదలుపెట్టారు. మొదట్లో అన్నా, హెచ్ ఎం టీ వంటి రకాలను సాగు చేశారు. అయితే వాటిల్లో కూడా నష్టాలు ఎదురయ్యాయి. దీంతో ఈసారి తన స్నేహితుడు ఇజ్రాయిల్ దేశంలో ఉంటున్న నేపథ్యంలో.. అక్కడి నుంచి KLD అనే రకానికి చెందిన మొక్కలను కొనుగోలు చేసి.. ఇక్కడికి తెప్పించారు..

కే ఎల్ డి రకం ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా దిగబడి ఇస్తుంది. కాయల నాణ్యత కూడా చాలా బాగుంటుంది.. చీడపీడలను తట్టుకుంటుంది. తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ పంట ఏపుగా పెరుగుతుంది. అక్కడినుంచి రమణారెడ్డి ఎకరానికి 650 మొక్కలు చొప్పున తెప్పించారు. ఎకరంలో 10*5 పరిమాణంలో మొక్కలు నాటుకున్నారు. ఒక మొక్కకు 650 రూపాయల వరకు ఖర్చయింది. కేవలం మొక్కల కోసమే పది లక్షల వరకు ఖర్చు చేశారు. మొక్కలకు డ్రిప్ విధానంలో నీరు అందిస్తున్నారు.

ఏడాది వయసులోనే ఆపిల్ మొక్కలు కాయలు కాస్తాయి. ఈ కాయలకు ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. రమణారెడ్డి తాను పండించిన ఆపిల్ కాయలను బెంగళూరు ప్రాంతానికి ఎగుమతి చేస్తున్నారు. రిలయన్స్, మోర్ నిర్వాహకులు రమణారెడ్డి పండించిన యాపిల్ కాయలను కొనుగోలు చేస్తున్నారు. ఏ గ్రేడ్ కాయలకు టన్నుకు 1,70,000, బి గ్రేడ్ కాయలకు 1, 20,000 చెల్లిస్తున్నారు. రమణారెడ్డి ఆపిల్ సాగులో తన అనుభవాన్ని ఇతర రైతులకు చెబుతున్నారు. ఆపిల్ సాగులో మరింత సమాచారం తెలుసుకోవడానికి రమణారెడ్డి ఫోన్ నెంబర్ 9346925502 నెంబర్ లో సంప్రదించవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper