spot_img
Homeబిజినెస్Mahindra Vision S SUV: ఈ కారును పర్వత ప్రాంతాల్లో టెస్ట్ చేస్తున్నారు.. ఎందుకో తెలుసా..

Mahindra Vision S SUV: ఈ కారును పర్వత ప్రాంతాల్లో టెస్ట్ చేస్తున్నారు.. ఎందుకో తెలుసా..

Mahindra Vision S SUV: SUV కార్లను మార్కెట్లోకి తీసుకురావడంలో మహీంద్రా దిట్ట. ఈ సంస్థ నుంచి త్వరలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ SUV ‘మహీంద్రా విజన్ S’. అయితే ఈ కారు గురించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ మరోసారి రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. గతేడాది ఆగస్టు 15న మహీంద్రా తన ‘ఫ్రీడమ్ NU’ ఈవెంట్‌లో ఈ విజన్ S కాన్సెప్ట్‌ను మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో,హైవేలపై ఈ కారును తీవ్రంగా టెస్టింగ్ చేస్తున్నారు. ఈ కారుకు సంబంధించిన డిజైన్, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

Mahindra Vision S కారు డిజైన్ చూస్తుంటే ప్రముఖ లగ్జరీ SUV అని అనిపిస్తుంది. ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్’, మహీంద్రా సొంత బ్రాండ్ ‘స్కోర్పియో’ల కలయికనా అన్నట్లు ఉంది. ఈ కారు నిటారుగా ఉండే బాక్సీ సిల్హౌట్ తో రోడ్‌పై మంచి బోల్డ్ లుక్‌ను ఇస్తుంది. దీని ముందు భాగంలో నిలువు గీతలు గల గ్రిల్ , రౌండ్ లేదా పిక్సెల్ తరహా LED హెడ్‌ల్యాంప్స్, మస్క్యులర్ బంపర్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ 17 నుంచి 18 అంగుళాల భారీ అలాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. వెనుక భాగంలో థార్ తరహాలో టైల్‌గేట్‌పైనే స్పేర్ వీల్ ను అమర్చారు.

ఇటీవలే ఈ కారు లోపల ప్రీమియం ఫీలింగ్ ఇచ్చేలా సరికొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్‌ను మహీంద్రా అందించబోతోంది. టాప్ ఎండ్ వేరియంట్లలో ఇన్ఫోటైన్‌మెంట్ , డ్రైవర్ డిస్‌ప్లే కోసం డ్యూయల్ స్క్రీన్ సెటప్ చేశారు. అంతేకాకుండా ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా ఫుల్ లెంత్ పనోరమిక్ సన్‌రూఫ్ ఇందులో కనిపించడం విశేషం. మిగిలిన ఫీచర్ల విషయానికి వస్తే.. సరికొత్త స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
పవర్‌ఫుల్ ఇంజన్ మరియు సరికొత్త ప్లాట్‌ఫారమ్

ఇంజిన్ విషయానికొస్తే.. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్: ఇది 130 PS పవర్, 230 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్: ఇది 117 PS పవర్, 300 Nm టార్క్‌ను అందిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఃగేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మహీంద్రా విజన్ S ప్రొడక్షన్ మోడల్ 2027 నాటికి భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్లోకి వచ్చాక ఇది సబ్-4 మీటర్ విభాగంలో ఉన్న టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ మరియు స్కోడా కైలాక్ వంటి కాంపాక్ట్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular