spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan: రామ్ చరణ్ చేసిన సినిమాల్లో మహేష్ బాబు కి నచ్చని సినిమా ఏంటంటే..?

Ram Charan: రామ్ చరణ్ చేసిన సినిమాల్లో మహేష్ బాబు కి నచ్చని సినిమా ఏంటంటే..?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం సైతం శాసించే స్థాయికి ఎదిగాడు. రీసెంట్ గా పెద్ది సినిమాతో ప్రేక్షకులందరి మెప్పు పొందిన ఆయన ఇప్పుడు మరోసారి సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రామ్ చరణ్ కెరియర్ లో చేసిన చాలా సినిమాలు అతనికి సక్సెస్ లను అందిస్తే కొన్ని సినిమాలు నిరాశపరిచాయి…

ఆయన ఫ్లాప్ సినిమాలకు కూడా ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ రావడం నిజంగా చాలా గొప్ప విషయం. రాంచరణ్ చేసిన సినిమాల్లో మహేష్ బాబుకి ఒక సినిమా అంటే అసలు నచ్చదట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే ‘గోవిందుడు అందరివాడేలే’ కావడం విశేషం…ఆ సినిమాలో ఎమోషన్స్ అంత పర్ఫెక్ట్ గా కుదరలేదని అది మంచి సబ్జెక్టు, కానీ దానిని ఇంకా ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేసుంటే బాగుండేదని ఆయన పలు సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది…

ఇక రామ్ చరణ్ మహేష్ బాబు ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికి తెలిసిందే. వీళ్లిద్దరు పలు పార్టీలలో కలిసి కనిపించడం ఒకరి ఈవెంట్స్ కి మరొకరు రావడం లాంటివి కూడా మనం గతంలో చూశాం…ఇక ఇలాంటి వీళ్లిద్దరి మధ్య ఎంత మంచి సన్నిహిత సంబంధం ఉన్నప్పటికి ఒకరి సినిమాలను ఒకరు పొగుడుతూ ఏ సినిమాల గురించి మరొకరు మాట్లాడుతుంటారట.

అందులో ఎవరెవరు ఎలా మిస్టేక్స్ చేశారు అనే విషయాల మీద కూడా చర్చించుకుంటారట. దీనివల్ల హీరోల మధ్య పోటీ వాతావరణం ఉండడమే కాకుండా మంచి సినిమాలు చేయాలనే ధోరణిలో కూడా ఆలోచనాలైతే సాగుతాయి. ఇదంతా ఒక పాజిటివ్ వైబ్ అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…చూడాలి మరి వీళ్లిద్దరూ రాబోయే సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular