Mahindra sales March 2026: దేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ఇదే సమయంలో కంపెనీలు పోటీపడి కొత్త కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అయితే ప్రస్తుతం వినియోగదారులు ఎక్కువగా SUV కార్లను కోరుకుంటున్నారు. ఒకప్పుడు బడ్జెట్, చిన్న సైజు కార్లను కొన్నవారు ఇప్పుడు వాటి స్థానంలో విశాలమైన యుటిలైజ్ కార్లను చేరుస్తున్నారు. దీంతో SUV కార్లకు డిమాండ్ పెరిగిపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కంపెనీలు వీటిని ఎక్కువగా తీసుకురావడానికి శ్రద్ధ చూపినట్లు తెలుస్తోంది. ఎప్పటికీ హాచ్ బ్యాక్ వంటి కార్లను తీసుకువచ్చే మారుతి సుజుకి సైతం ఎస్ యు వి లను తీసుకురావడంపై వీటికి డిమాండ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటికే మార్కెట్లో SUV సెగ్మెంట్ల కార్లకు ప్రత్యేక గుర్తింపు పొందిన మహీంద్రా కంపెనీ మార్చి నెలకు సంబంధించిన అమ్మకాలను వెంటనే ప్రకటించింది. ఈ కంపెనీ ఈ నెలలో ఎన్ని విక్రయాలు జరిపిందో ఇప్పుడు చూద్దాం..
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మార్చి నెలలో SUV కార్ల అమ్మకాలతో తన జోరును కొనసాగించింది. ఈ ఏడాది మార్చి నెలలో దేశీయ, ఎగుమతి కార్ల తో కలిపి మొత్తం 99, 969 యూనిట్లను సేల్స్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 21 శాతం వృద్దిని సాధించినట్లు కనబడుతోంది. ఇందులో ఎక్కువగా SUV లే ఉండడం విశేషం. ఇవి 60,272 యూనిట్లు ఉన్నాయి. ఎగుమతులను కలుపుకుంటే మరో 2000 యూనిట్లు సేల్స్ చేసింది. మొత్తంగా మహీంద్రా కంపెనీ ఎస్ యు వి కారులను విక్రయించడంలో మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ కంపెనీ నుంచి ప్యాసింజర్ వాహనాలు మాత్రమే కాకుండా వ్యాపారాలకు అవసరమైన వెహికల్స్ కూడా ఎక్కువగా సేల్స్ అయినట్లు తెలుస్తోంది. మార్చి నెలలో వ్యాపార అవసరాలకు ఉపయోగపడే వాహనాలు 24,928 యూనిట్లు సేల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో గత ఏడాది కంటే ఇప్పుడు 11% వృద్ధిని సాధించింది.. అలాగే లైట్ కమర్షియల్ వెహికల్స్ లోను 13 శాతం అమ్మకాలను పెంచుకుంది. ఇవి మార్చి నెలలో 21,402 యూనిట్లో ఉన్నాయి. త్రీ వీలర్ విభాగంలో 10,810 యూనిట్ల సేల్స్ జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 39 శాతం అధికంగా ఉంది. ఇదే జోరు ఈ ఏడాది చివరి వరకు కొనసాగితే మరోసారి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎస్ యు వి లతోపాటు వాణిజ్య వాహనాల విక్రయాల్లో టాప్ లెవల్ లో ఉండే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.
