Homeబిజినెస్Loan pre closure benefits: లోన్ ప్రీ క్లోజ్ చేసేవారికి గుడ్ న్యూస్..

Loan pre closure benefits: లోన్ ప్రీ క్లోజ్ చేసేవారికి గుడ్ న్యూస్..

Loan pre closure benefits: బ్యాంకు వ్యవహారాలు మెరుగ్గా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకువస్తూ ఉంటోంది. ఇందులో భాగంగా లేటేస్ట్ గా ఈఎంఐ విషయంలో ఆర్బీఐ కొత్త రూల్ పెట్టనుంది. ఇప్పటి వరకు బ్యాంకులు లోన్ డేటాను నిర్ణీత కాలంలో ఆర్బీఐకి సమర్పించేవి. కానీ 2026 జూన్ 1 నుంచి అన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లు తమ ఖాతాదారుల లోన్ డేటాను ప్రతి వారం CIBIL వంటి క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కొత్త రూల్‌తో వీక్లీ ట్రాకింగ్ తప్పనిసరి అవుతుంది. ఈ మార్పు వినియోగదారుల క్రెడిట్ హిస్టరీని మరింత ట్రాన్స్‌పరెంట్‌గా మార్చడానికి, డిఫాల్ట్‌లను త్వరగా గుర్తించడానికి ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఇక నుంచి లోన్స్ ప్రీ క్లోజ్ చేస్తే ఛార్జీలు తొలగించే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్యాంకు నుంచి లోన్ తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఈఎంఐ చెల్లించేటప్పుడు చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇక నుంచి మరింత పటిష్టంగా ప్రతీ నెల తప్పనిసరిగా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో EMI మిస్ అయినా 30 రోజుల వరకు స్కోర్ ప్రభావితం కాకుండా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతీ వారం లోన్ రిపోర్టును తెలపాలని ఆర్బీఐ కోరింది. దీంతో వారం చివరికి డేటా అప్‌డేట్ అవుతుంది కాబట్టి సిబిల్ స్కోర్ తగ్గే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు, హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ EMI మిస్ చేస్తే, కొత్త లోన్ కోసం అప్లై చేసేటప్పుడు ఇబ్బంది పడవచ్చు. RBI ఈ నియమం ద్వారా బ్యాంకులు మరింత కఠినంగా రికవరీ చేయాలని, కస్టమర్లు డిసిప్లిన్‌తో చెల్లింపులు చేయాలని ఆశిస్తోంది.

ఇదిలా ఉండగా లోన్ ప్రీ-క్లోజర్ (ముందస్తు చెల్లించడం)పై అధిక ఛార్జీలు పూర్తిగా రద్దు అవుతాయి. ఇప్పటివరకు బ్యాంకులు 2 నుంచి 4 శాతం ప్రీ-పేమెంట్ పెనాల్టీ వసూలు చేసేవి. ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్‌లకు కూడా. కొత్త రూల్‌తో ఇది జీరో అవుతుంది, వినియోగదారులు ఎప్పుడైనా లోన్ క్లోజ్ చేసి, ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఇది ఇంట్రెస్ట్ రేట్‌లు తగ్గినప్పుడు లేదా ఎక్స్‌ట్రా డబ్బు దొరికినప్పుడు ప్రయోజనకరం. ఉదాహరణకు, 50 లక్షల హోమ్ లోన్‌లో 3 శాతం పెనాల్టీ 1.5 లక్షలు . ఇది ఇక సేవ్ అవుతుంది.

ఈ మార్పులు భారతదేశంలోని 50 కోట్లకు పైగా లోన్ ఖాతాదారులను ప్రభావితం చేస్తాయి. బ్యాంకులు కొత్త సాఫ్ట్‌వేర్‌లు అమలు చేసి, వీక్లీ డేటా అప్‌లోడ్ చేయాలి. ఇది వాళ్లకు అదనపు ఖర్చు. కానీ వినియోగదారులకు లాంగ్-టర్మ్‌లో క్రెడిట్ డిసిప్లిన్ మెరుగుపడుతుంది. RBI ఈ నిబంధనలు డిజిటల్ లెండింగ్‌ను మరింత సురక్షితం చేయడానికి, NPAs (నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్) తగ్గించడానికి తీసుకుంటోందని చెబుతోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular