ChatGPT AI UPI Payments : ప్రస్తుతం చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్క పేమెంట్స్ UPI ద్వారానే జరుగుతోంది. కూరగాయల నుంచి షాపింగ్ మాల్ వరకు ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్ జరుగుతున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం కొన్ని రంగాల్లో మాత్రమే ఉన్న Artificial Intelligence (AI) ఇప్పుడు యూపీఐ సేవలు అందించడానికి రెడీ అవుతుంది. AI కి చెందిన Chat Gpt ని ఇప్పటికే చాలామంది ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా కావాల్సిన సమాచారాన్ని, ఫొటోస్, వీడియోలు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా Chat Gpt యూపీఐ సేవలను కూడా అందించడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే National payments Corporation of India (NPCI) తో పేమెంట్ చేయడానికి Razor pay అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ చాట్ చీటీ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా రంగాలు దీనిని ఉపయోగించుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా యూపీఐ ని కూడా ఇందులోకి చేర్చడం ద్వారా వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. వినియోగదారుడు చార్ట్ జిపిటి ద్వారా ప్రాంప్ట్ ను తయారుచేసుకొని దాని ద్వారా కిరాణం సరుకులు, ఇతర షాపింగ్ మాల్స్ వంటివి వెతుక్కొని దీని ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చును. అంతేకాకుండా ఇందులో క్యూఆర్ కోడ్ ఆప్షన్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
Razor pay యాప్ లోకి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవడానికి యాక్సిస్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ ఇప్పటికే అనుమతిని ఇచ్చాయి. అయితే ముందుగా దీనిని ఈ కామర్స్ సేవలు ఉపయోగించి.. విజయవంతం అయిన తర్వాత మిగతా సేవలను కూడా కలిపే అవకాశం ఉంది. ఈ ప్రాంప్ట్ తయారుచేసిన తర్వాత చాట్ జిపిటిలో తనకు కావాల్సిన ఆహార పదార్థాలు.. వస్తువుల గురించి వివరాలు వెల్లడిస్తే అందుకు సంబంధించిన సమాచారం ఇందులో కనిపిస్తుంది. ఆ తర్వాత వాటిని ఎంచుకొని Razor pay ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఇది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిపై కొన్ని ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. వినియోగదారుల పర్సనల్ డేటా ఇందులో వెల్లడించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకుకు సంబంధించిన వివరాలు ఏఐ కి తెలపడం వల్ల వినియోగదారుల డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా వినియోగదారుడి డేటాకు ఎవరూ బాధ్యులు అనే విషయాన్ని ఇప్పటివరకు చెప్పలేదు. దీంతో ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి. ఇప్పటివరకు చాలామంది ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మాత్రమే మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఏఐ ద్వారా మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు నిపుణులు తెలుపుతున్నారు.