spot_img
Homeబిజినెస్రైతులకు కేంద్రం శుభవార్త.. ధరల పెరుగుదలకు చెక్..?

రైతులకు కేంద్రం శుభవార్త.. ధరల పెరుగుదలకు చెక్..?

centre directs fertiliser firms not to hike price

కరోనా కష్ట కాలంలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రోజురోజుకు విత్తనాల ఖర్చులు, పురుగు మందుల ఖర్చులు, ఎరువుల ఖర్చులు పెరుగుతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా రావడం లేదు. ఇలాంటి సమయంలో ఎరువుల ధరలు భారీగా పెరుగుతున్నట్టు జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఎరువుల ధరలు మరింత పెరిగితే రైతులు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

రైతులు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం యూరియా మినహా ఇతర ఎరువుల ధరలను పెంచొద్దని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఎరువుల రేట్లు పెంచనున్నట్టు వైరల్ అయిన వార్తల వల్ల రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి స్పష్టతనిచ్చింది. అంతర్జాతీయ పోకడలకు అనుగుణంగా ఎరువుల ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉండటంతో కేంద్రం రైతులకు రాయితీ కల్పిస్తూ కంపెనీలకు ఆ డబ్బులు చెల్లిస్తోంది.

రైతులు పాత ధరలకే డీఏపీ, ఎంఓపీ, ఎన్‌పీకేలను పొందే అవకాశం ఉండగా యూరియా ధరలు మాత్రం పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ సోషల్ మీడియా ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని తెలిపారు. గతంలోనే కంపెనీలు ఎరువుల ధరలను పెంచాలని భావించాయి.

స్థానిక వ్యాపారులకు సైతం ఎరువుల ధరలు భారీగా పెరుగుతున్నట్టు సమాచారం అందింది. ధరలు పెరిగితే ఇబ్బందులు పడక తప్పదని అన్నదాతలు భావించిన తరుణంలో తాజా ఆదేశాలతో రైతులకు ఊరట లభించట్లైంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper