
రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతోనే ఆయన సహవాసం చేస్తూనే ఉంటారు. ఎవరినో ఒకరిని కెలకనిదే ఆయనకు నిద్రపట్టదు. ఇక హీరోయిన్లతో కలిసి సరదాగా సేదతీరనిదే వర్మ నిద్రపోడు.
‘శివ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ తీసి తెలుగు సినిమాకు కొత్త ఒరవడి నేర్పిన క్రియేటివ్ దర్శకుడు వర్మ.. 2020 వచ్చేసరికి ఆ సృజనాత్మకత అంతా చచ్చుబడిపోయి ఇప్పుడు బూతు సినిమాలు తీసుకొని బతికే కాలం వస్తుందని ఎవరైనా ఊహించారా? కానీ అదే జరిగింది. అడపదడపా వివాదాస్పద అంశాలపై సినిమాలు ప్రకటిస్తూ కొన్ని తీస్తూ కొన్ని వదిలేస్తూ హీరోయిన్లతో అలా అలా కాలం గడిపేస్తున్నారు.
ప్రస్తుతం మళ్లీ కరోనా ప్రబలడంతో వర్మ గోవాకు వెళ్లి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. తనతోపాటు కొందరు హీరోయిన్లు, టెక్నీషియన్లు కూడా ఉండడంతో వర్మ తెగ సందడి చేస్తున్నాడు.
తాజాగా వర్మ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక అమ్మాయిని గట్టిగా తన కౌగిలిలో బంధించిన ఫొటోను షేర్ చేశాడు. ‘రాంగోపాల్ వర్మ విత్ దెయ్యం’ అని క్యాప్షన్ ఇచ్చాడు. తెలుగులో ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ అయిన ప్రసన్న దంతులూరితో కలిసి వర్మ ఈ ఫొటో దిగాడు. ఆమెను గట్టిగా పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చాడు.
ప్రసన్న తెలుగులో ‘ఉప్పెన’, జాంబిరెడ్డి లాంటి ప్రముఖ సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా సేవలందించింది. ఆమెతో తాను దేవుడి సాక్షిగా ప్రేమలో ఉన్నానని .. ఆమె క్యాస్టూమ్స్ అంటే తనకు ఇష్టం అని వర్మ పేర్కొన్నారు.
వర్మ ఇన్ స్టాగ్రామ్ ఫొటోలు
https://www.instagram.com/p/CNcC9XGl6_4/?utm_source=ig_web_copy_link