Homeబిజినెస్Best family cars for summer vacation: కుటుంబంతో కలిసి వేసవి విహారయాత్రకు వెళ్తున్నారా.. మీకు...

Best family cars for summer vacation: కుటుంబంతో కలిసి వేసవి విహారయాత్రకు వెళ్తున్నారా.. మీకు సరిపోయే కార్లు ఇవే..

Best family cars for summer vacation: వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులంతా కలిసి విహారయాత్రలకు వెళ్లడం ఒక మధురమైన అనుభవం. అయితే అందరూ ఒకే వాహనంలో ప్రయాణించాలన్నా.. లగేజీని సౌకర్యవంతంగా సర్దుకోవాలన్నా 7-సీటర్ కార్లు (MPV లేదా SUV)కార్లను ఎంచుకోవడం మంచిది. అలాగే ప్రయాణం భారంగా అనిపించకుండా ఉండాలంటే మంచి మైలేజ్ ఇచ్చే కార్ల గురించి కూడా అవగాహన ఉండటం అవసరం. అటువంటి కొన్ని బెస్ట్ కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. మారుతీ సుజుకి ఎర్టిగా […]

Best family cars for summer vacation: వేసవి సెలవుల్లో కుటుంబ సభ్యులంతా కలిసి విహారయాత్రలకు వెళ్లడం ఒక మధురమైన అనుభవం. అయితే అందరూ ఒకే వాహనంలో ప్రయాణించాలన్నా.. లగేజీని సౌకర్యవంతంగా సర్దుకోవాలన్నా 7-సీటర్ కార్లు (MPV లేదా SUV)కార్లను ఎంచుకోవడం మంచిది. అలాగే ప్రయాణం భారంగా అనిపించకుండా ఉండాలంటే మంచి మైలేజ్ ఇచ్చే కార్ల గురించి కూడా అవగాహన ఉండటం అవసరం. అటువంటి కొన్ని బెస్ట్ కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

మారుతీ సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga):
భారతీయ మార్కెట్లో 7-సీటర్ విభాగంలో ఎర్టిగా అత్యంత ఆదరణ పొందిన కారు. దీనికి ప్రధాన కారణం దీని మైలేజ్ తో పాటు స్పేస్ కూడా కన్వినెంట్ గా ఉంటుంది . ఈ కారు పెట్రోల్ వేరియంట్ లీటరుకు సుమారు 20 కి.మీ. మైలేజీని ఇస్తుంది. CNG వేరియంట్ అయితే ఏకంగా 26 కి.మీ. వరకు మైలేజ్ వెళ్లొచ్చు. ఇందులో మూడు వరుసల సీట్లు ఉండటమే కాకుండా, చివరి వరుసను ఫోల్డ్ చేయడం ద్వారా భారీ లగేజ్ స్పేస్‌ను సృష్టించుకోవచ్చు. దీని స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ లాంగ్ ట్రిప్స్‌లో ఇంధనాన్ని బాగా ఆదా చేస్తుంది.

కియా కారెన్స్ (Kia Carens):
మంచి ఫీచర్లు, ప్రీమియం లుక్ తో పాటు సేఫ్టీ కోరుకునే వారికి కియా కారెన్స్ ఒక అద్భుతమైన ఛాయిస్. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ముఖ్యంగా దీని డీజిల్ ఇంజిన్ హైవేలపై 21 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఈ కారులో ‘వన్-టచ్ టంబుల్’ సీట్ ఫీచర్ ఉండటం వల్ల వెనుక సీట్లకు వెళ్లడం చాలా సులభం. లాంగ్ డ్రైవ్స్‌లో ప్రయాణికులకు అలసట కలగకుండా ఉండేలా ఇందులో వెన్టిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross):
మీ బడ్జెట్ కొంచెం ఎక్కువగా ఉండి.. విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకుంటే టయోటా ఇన్నోవా హైక్రాస్ బెస్ట్. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది పెద్ద కారు అయినప్పటికీ.. ఇది లీటరుకు దాదాపు 23.24 కి.మీ. మైలేజీని ఇస్తుండటం విశేషం. ఇందులో లగేజ్ పెట్టుకోవడానికి చాలా ఎక్కువ స్థలం ఉంటుంది. 7 నుంచి 8 మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. కొండ ప్రాంతాలకు లేదా దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు దీని పవర్, కంఫర్ట్ అద్భుతంగా ఉంటుంది.

మహీంద్రా మరాజో & XUV700 (Mahindra Marazzo & XUV700):
మహీంద్రా కార్లు వాటి బిల్డ్ క్వాలిటీ, శక్తివంతమైన ఇంజిన్లకు ప్రసిద్ధి. మహీంద్రా మరాజో ప్రత్యేకంగా కుటుంబ ప్రయాణాల కోసం రూపొందించబడింది. ఇది దాదాపు 17 కి.మీ. మైలేజీని ఇస్తుంది. ఇక స్టైలిష్‌గా వెళ్లాలనుకునే వారు XUV700ని ఎంచుకోవచ్చు. ఇందులో అధునాతన ADAS సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్లలో రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్ ఉండటం వల్ల వేసవి ఎండల్లో కూడా కారు లోపల ప్రయాణికులందరికీ చల్లటి గాలి అందుతుంది.

రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber):
తక్కువ బడ్జెట్‌లో 7 సీటర్ కారు కావాలనుకునే వారికి రెనాల్ట్ ట్రైబర్ ఒక మంచి ఆప్షన్. ఇది సుమారు 18 నుంచి 19 కి.మీ. మైలేజీని ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే .. ఇందులోని సీట్లను మన అవసరానికి తగ్గట్టుగా 100 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ నలుగురు మాత్రమే ప్రయాణిస్తుంటే, వెనుక సీట్లను పూర్తిగా తొలగించి భారీ స్థాయిలో లగేజీని పెట్టుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper