spot_img
Homeబిజినెస్Xiaomi small electric car: పొడవు 3 మీటర్లు.. మైలేజ్ 1200 కిలోమీటర్లు .. ఈ...

Xiaomi small electric car: పొడవు 3 మీటర్లు.. మైలేజ్ 1200 కిలోమీటర్లు .. ఈ కారు గురించి తెలిస్తే వెంటనే కొంటామంటారు..

Xiaomi small electric car: పెట్రోల్ ధరలు పెరగడంతో చాలా మందికి మైలేజ్ సమస్య ఎదురవుతోంది. దీంతో ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో కంపెనీలు సైతం విద్యుత్ కార్ల ఉత్పత్తిపై ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల EVలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే కాస్త ఆకర్షణీయంగా మైలేజ్ ఎక్కువగా ఇచ్చే కార్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ కారు విపరీతంగా టెంప్ట్ చేస్తోంది. ఈ కారు చూడ్డానికి చాలా చిన్నగా కనిపిస్తోంది. కానీ దీని మైలేజ్ చూస్తే మాత్రం వెంటనే కొంటానంటారు. ‘పిట్ట కొంచెం.. కూత ఘనం’ లాగా.. ఈ కారు సైజు చిన్నదే అయినా.. మైలేజ్ మాత్రం ఘనంగా ఉండనుంది. ఇంతకీ ఇది ఏ కారు? ఇది ఇచ్చే మైలేజ్ ఎంత?

చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ First Auto Works (FAW) తన అనుబంధ బ్రాండ్ అయిన ‘బెస్ట్‌ట్యూన్’ (Bestune)ద్వారా Xiaoma అనే మైక్రో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. చైనాలో దీనికి ‘బెస్ట్‌ట్యూన్ పోనీ’ అని కూడా అంటారు. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీని కోరుకునే సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఈ కారును రూపొందించారు.

Xiaoma కారు చాలా కాంపాక్ట్ డిజైన్‌తో చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. కానీ దీని పొడవు కేవలం 3 మీటర్ల మాత్రమే. దీంతో రద్దీగా ఉండే నగరాల్లో పార్కింగ్ తో పాటు ప్రయాణానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ కారు ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, ప్రీమియం లుక్ ఇచ్చే ఫినిషింగ్ ఉంటారు. ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందాలని అనుకునేవారికి ఇది సౌకర్యాన్ని అందిస్తుంది. సేప్టీ కోసం ఇందులో డ్రైవర్ వైపు ఎయిర్‌బ్యాగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS),ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారు మైలేజ్ గురించి తీవ్రంగా చర్చ సాగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ కారు ఫుల్ ఛార్జ్‌పై 1200 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే అసలు విషయం ఏంటంటే ఈ కారు యొక్క స్టాండర్డ్ ఎలక్ట్రిక్ వేరియంట్ సాధారణంగా 120 కి.మీ నుండి 170 కి.మీ రేంజ్ ఇస్తుంది. కానీ, ఇందులో ‘రేంజ్ ఎక్స్టెండర్’ (Range Extender) అనే టెక్నాలజీని వాడటం ద్వారా ఇది దాదాపు 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంటోంది. అంటే బ్యాటరీతో పాటు ఒక చిన్న ఇంజిన్ సహాయంతో రేంజ్ పెంచుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది.

చైనా మార్కెట్లో ఈ కారు ధర సుమారు 30,000 నుండి 50,000 యువాన్ల మధ్య ఉంది. అంటే భారతీయ కరెన్సీలో దీని ధర దాదాపు రూ. 3.50 లక్షల నుంచి రూ. 5.80 లక్షల వరకు ఉండవచ్చు. ఇంత తక్కువ ధరలో భారీ మైలేజీని అందించే కారు కావడం వల్ల ఇది ఇతర ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ కారు చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, టాటా టియాగో EV, MG కామెట్ EV వంటి చిన్న కార్లకు పోటీగా దీనిని త్వరలో భారతదేశంలో కూడా విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారత్ లాంటి దేశాల్లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే కార్లకు డిమాండ్ ఎక్కువ కాబట్టి, ఇది ఇక్కడ విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper