Homeఆంధ్రప్రదేశ్‌YSRCP losing grip: వైసిపి గాడిన పడుతోందా? తప్పుతోందా?!

YSRCP losing grip: వైసిపి గాడిన పడుతోందా? తప్పుతోందా?!

YSRCP losing grip: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ గాడిన పడుతోందా? గాడి తప్పుతోందా? అన్నది తెలియడం లేదు. ఏ కారణాలతో ఆ పార్టీ ఓటమి చవిచూసిందో.. ఎవరి వల్ల ఆ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందో.. వాటిని నమ్ముకున్నట్టు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంతులేని విజయంతో.. విపరీతమైన ప్రజామోదంతో అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించి బలమైన శక్తిగా మారింది. విపరీతమైన అనుకూలతలు ఉన్న క్రమంలో.. ప్రతికూలతలను పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు చాలా తెలివైన వారు. అన్ని గమనిస్తుంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలు చేసింది అదే. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చి ఉండవచ్చు కానీ వారు అభివృద్ధిని కోరుకున్నారు. పైగా అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలాలు, అభ్యంతరకర కామెంట్స్ వంటి వాటి విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి దూకుడు కలిగిన నేతలు తమ సైన్యం అనుకున్నారు. కానీ ప్రజలు అలా భావించలేదు. అయితే ఇప్పుడు పాత ధోరణి అన్నట్టు.. మళ్లీ ఆ పాత నేతలు తెరపైకి వస్తున్నారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు.

సీనియర్లకు ప్రాధాన్యం..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నట్లు కనిపించారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతను పిలిపించి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. ఏకంగా శాసనమండలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా బాధ్యతలు ఇచ్చారు. తద్వారా తాను మారిపోయానని.. సీనియర్లకు అవకాశం ఉంటుందని భావించారు అందరూ. ఒకవైపు బొత్స లాంటి సీనియర్ ద్వారా రాజకీయం చేస్తూనే… దూకుడు కలిగిన నేతల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బతికించాలని భావించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ క్రమంలో తన పాత ధోరణిని ఆయన విడిచిపెట్టలేదు అని అర్థమవుతుంది. ఎవరెవరి ద్వారా అయితే పార్టీకి నష్టం జరిగిందో.. అటువంటి నేతలను ఇప్పుడు పిలిచి యాక్టివ్ చేయడం మాత్రం ముమ్మాటికీ ఆ పార్టీకి నష్టమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Also Read: 100 రోజుల ‘జైలు’కు ఫిక్స్ అయిన కొడాలి నాని!

సీఎం పై తిట్ల దండకం..
నడిరోడ్డుపై అంబటి రాంబాబు( ambati Rambabu) ముఖ్యమంత్రి చంద్రబాబును తిట్టారు. ఇప్పటికే చంద్రబాబు విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు ఆ పార్టీకి నష్టం చేకూర్చింది. అయినా సరే అంబటి లాంటివారు నడిరోడ్డుపై తిడితే అడ్డగోలుగా సమర్ధించారు జగన్మోహన్ రెడ్డి. తిట్టిన అంబటి రాంబాబును అరెస్టు చేస్తే ఆయనను ఒక సామాజిక వర్గ టైగర్ గా చూపించారు. ఇప్పుడేమో కొడాలి నానిని మరోసారి తెరపైకి తెస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బూతుల టాగ్ తగిలింది ఆయన వల్లే. దానివల్లే ఆ పార్టీకి అపారమైన నష్టం జరిగిందని సీనియర్లు సైతం భావిస్తున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి వారిని ఎంటర్టైన్ చేస్తుండడం మాత్రం ఎంత మాత్రం సహేతుకం కాదు. ఈ దూకుడు తనం తొలిసారి అధికారంలోకి వచ్చేందుకు పనికి వస్తుంది. కానీ సుదీర్ఘకాలం రాజకీయాలు చేయాలంటే ఇటువంటి దూకుడు కలిగిన నేతల నోటికి తాళం వేయాల్సిందే. నిన్ననే అంబటి రాంబాబు పరామర్శకు వచ్చారు కొడాలి నాని. కొంచెం జాగ్రత్తగా మాట్లాడినా… అక్కడక్కడ తన పాత ధోరణి కనిపిస్తోంది. అది శృతిమిస్తే మాత్రం వైసీపీకి ఉన్న బూతుల ట్యాగ్ చెరపలేరు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular