YSR Congress MLC Resignations Approval: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఎమ్మెల్సీల రాజీనామా పై మండలి చైర్మన్ తప్పకుండా ఒక నిర్ణయానికి రావాల్సిన అనివార్య పరిస్థితి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే వారి రాజీనామాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో బలం తగ్గిపోతుంది. ఆ కారణంతోనే వైసీపీకి చెందిన మండలి చైర్మన్ జాప్యం చేస్తూ వస్తున్నారు. వారి రాజీనామా చేసి ఏడాదికి పైగా అవుతున్న తరుణంలో వారు కోర్టులను ఆశ్రయించారు. దీంతో వారిని మూడు వారాల్లో విచారణ చేపట్టి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటానని చైర్మన్ కోర్టులకు తెలిపారు. అందుకు సంబంధించి గడువు సమీపిస్తుండడంతో తప్పకుండా రాజీనామాలను ఆమోదించాల్సిన అనివార్య పరిస్థితి చైర్మన్ కు ఏర్పడింది.
Also Read: కెసిఆర్ కాళ్లు పట్టుకుంటాడట.. పాపం ఆ వైసిపి నాయకుడికి ఎంత గతి పట్టింది
* ఏడాదిగా జాప్యం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తి, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, జయ మంగళం వెంకటరమణ, మర్రి రాజశేఖర్ తదితరులు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పిన తరుణంలో నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవులను సైతం రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే రకరకాల కారణాలను చెబుతూ వారి రాజీనామాలను ఆమోదించకుండా మండలి చైర్మన్ జాప్యం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో జయ మంగళం వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. మూడు వారాల్లోగా ఎమ్మెల్సీ ల నుంచి లిఖితపూర్వకంగా రాజీనామా కారణాలు తీసుకొని ఆమోదించాలని కోర్టు ఆదేశించింది.
* వ్యూహాత్మకంగా వ్యవహరించినా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల రాజీనామా విషయంలో ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్ళింది. వారు తమ రూట్లోకి వస్తారని భావించింది. చాలా రకాలుగా బతిమిలాడింది. కానీ ఎవరు నిర్ణయం సానుకూలంగా తీసుకోకపోవడంతో వదులుకోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచి లిఖితపూర్వకంగా కారణాలు అడిగి తెలుసుకున్నారు. తప్పకుండా ఈ రాజీనామాలను ఆమోదించే అవకాశం ఉంది. అదే జరిగితే ఎమ్మెల్సీల బలం పెరుగుతుంది కూటమికి. దాదాపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సమీపిస్తుంది ఆ సంఖ్య. అయితే వీరి రాజీనామా ఆమోదించిన మరుక్షణం మరింత మంది వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
