Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Heatwave Alert: ఏపీలో ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

Andhra Pradesh Heatwave Alert: ఏపీలో ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

Andhra Pradesh Heatwave Alert: ఏపీలో( Andhra Pradesh) ఎండలు ముదిరాయి. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఉక్కపోత ప్రారంభం అయ్యింది. గత కొద్ది రోజులుగా ఆవర్తనం ప్రభావంతో చల్లటి వాతావరణం కొనసాగింది. కానీ ఇప్పుడు మాత్రం ఎండల తీవ్రత పెరుగుతోంది. రెండు రోజులపాటు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని చెబుతోంది విపత్తుల నిర్వహణ సంస్థ. ఏకంగా 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యేందుకు అవకాశం ఉంది. అత్యవసరం అయితే తప్పించి […]

Andhra Pradesh Heatwave Alert: ఏపీలో( Andhra Pradesh) ఎండలు ముదిరాయి. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ఉక్కపోత ప్రారంభం అయ్యింది. గత కొద్ది రోజులుగా ఆవర్తనం ప్రభావంతో చల్లటి వాతావరణం కొనసాగింది. కానీ ఇప్పుడు మాత్రం ఎండల తీవ్రత పెరుగుతోంది. రెండు రోజులపాటు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని చెబుతోంది విపత్తుల నిర్వహణ సంస్థ. ఏకంగా 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యేందుకు అవకాశం ఉంది. అత్యవసరం అయితే తప్పించి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు నిపుణులు.
* ఈరోజు మొత్తం 54 మండలాల్లో తీవ్ర వడగాలులు, 16 మండలాల్లో వడగాలులు వీస్తాయి. శనివారం 41 మండలాల్లో తీవ్రవాడ గాలులు, 21 మండలాల్లో వడగాలులు ఇచ్చే అవకాశం ఉంది.
* నిన్న రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా రాజాంలో 406 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, చిత్తూరు జిల్లా నిండ్రలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
* ఒకవైపు ఎండ తీవ్రత కొనసాగుతుండగా మరోవైపు వేడి గాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులతో పాటు చిన్నపిల్లలు అసౌకర్యానికి గురవుతున్నారు.
* ఎప్పటికప్పుడు ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేస్తోంది. ఎండల తీవ్రత సమాచారం లేదా అత్యవసర సహాయం కోసం APSDMA కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 1800 4250101 కు సంప్రదించాలని సూచిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper