Homeఆంధ్రప్రదేశ్‌YS Vijayamma Vs Jagan Mohan Reddy Dispute: జగన్ వైఖరి బాధేస్తోంది.. వైయస్ విజయమ్మ...

YS Vijayamma Vs Jagan Mohan Reddy Dispute: జగన్ వైఖరి బాధేస్తోంది.. వైయస్ విజయమ్మ ఆవేదన అదే

బయటకు అంతా బాగానే కనిపిస్తున్నారు కానీ.. వైయస్ విజయమ్మ ( YS Vijayamma ) లోలోపల బాధపడుతున్నారు. చాలా మదన పడుతున్నారు. ముఖ్యంగా సరస్వతి పవర్ షేర్ల బదలాయింపు పై జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు విజయమ్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాపై ఉన్న ప్రేమ, ఆప్యాయతతోనే జగన్ ఆనాడు షేర్లను గిఫ్ట్ డీడ్ ద్వారా రాసి ఇచ్చారు. ఆ ప్రేమను ఆయన ఇప్పుడు కాదనలేరు అంటూ ఆమె పేర్కొన్న మాటలు ఆలోచింపజేస్తున్నాయి. గతంలో ప్రేమతో ఇచ్చిన వాటిని ఇప్పుడు ప్రేమ లేదని వెనక్కి తీసుకోవడం అనైతికం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!

* బినామీ అనడం దారుణం..
సరస్వతీ పవర్( Saraswati power) షేర్ బదలాయింపులకు సంబంధించి చెన్నై ఎన్సీఎల్టీ వేదికగా ఇరు వర్గాల మధ్య వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో షర్మిలకు విజయమ్మ బినామీ అంటూ జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిని విజయమ్మ తీవ్రంగా ఖండించారు. నేను ఎవరికీ బినామీ కాదన్నారు. తన పిల్లల మధ్య సయోధ్య కుదరచడమే తల్లిగా తన బాధ్యతని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి బతికున్న సమయంలోనే ఆస్తుల పంపకాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని.. ఆ ప్రకారం మాత్రమే షర్మిలకు వాటాలు దక్కాయని గుర్తు చేశారు. తల్లిని కుమార్తెకు బినామీ అనడంపై తాను మనస్థాపానికి గురైనట్లు ఆమె స్పష్టం చేశారు ఆ పిటిషన్ లో…

* ఒక్కో వాస్తవం బయటకు..
వైయస్ విజయమ్మ ఈ కేసు విషయంలో చాలా ఆవేదనతో ఉన్నారు. అప్పట్లో జరిగిన వాస్తవాలను బయట పెడుతున్నారు. 2019లో జరిగిన ఎంఓయూ ప్రకారం జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) స్వచ్ఛందంగానే షేర్లను తనకు బదలాయించారని.. ఇది చట్ట ప్రకారం జరిగిందని విజయమ్మ చెబుతున్నారు. ఆ షేర్లను తాను షర్మిలకు ఇవ్వాలని అప్పుడే ఏకాభిప్రాయంతో నిర్ణయించారని.. ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇది జరిగిందని.. కానీ ఇప్పుడు రాజకీయ విభేదాలతో వివాదాలు సృష్టించాలనుకోవడం తగదని.. తన కుమారుడు ఇలా ప్రవర్తించడం తల్లిగా తనకు ఎంతో బాధగా ఉందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

* అభిమానులకు నిరాశ..
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వైయస్ కుటుంబంలో మరింత రచ్చ రేపుతోంది. ఎప్పటికైనా ఆ కుటుంబం ఒక్కటి కాకపోతుందా అని ఆశించే అభిమానులకు నిరాశ మిగిల్చుతోంది. ఇప్పటికే రాసిచ్చిన ఆస్తుల కోసం జగన్మోహన్ రెడ్డి తల్లితో పాటు చెల్లిని ఎందుకు కోర్టుకు లాగాలి? బాగానే సంపాదించారు కదా? మరి ఎందుకు ఈ రచ్చ? అంటూ సగటు వైసిపి అభిమానులు కూడా ఆవేదనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేసిన వారు ఉన్నారు. ఇప్పటివరకు పొలిటికల్ గా డ్యామేజ్ జరిగింది చాలదా అన్న వారు ఉన్నారు. కానీ జగన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆస్తుల వివాదం వదిలే ప్రసక్తి లేదని సంకేతాలు ఇస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Oktelugu Epaper