Donald Trump Comments On India Religious Freedom: అగ్రరాజ్యం అమెరికాకు బలుపు చాలా ఎక్కువ. ఎందుకంటే డబ్బు ఉందని, ప్రపంచాన్ని శాసించే శక్తి ఉందని, తాము ఏం చేసినా చెల్లుతుందనే అహకారం కారణంగా తమకు నచ్చిన దేశాలను ఎత్తుకోవడం,.. నచ్చని దేశాలను కించపర్చడం ఆ దేశానికి అలవాటే. భారత దేశంపై కూడా అనేకసార్లు నిరాధారమైన ఎన్నో ఆరోపణలు చేసింది. తాజాగా భారత్‌ను డెడ్ ఎకానమీగా కూడా పేర్కొన్నాడు. మన ఎదుగుదలను చూసి ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. ఇక తాజాగా అమెరికా ప్రభుత్వం నడిపించే సంస్థ ద్వారా మన దేశంలో మత స్వేచ్ఛపై ఓ నివేదిక తయారు చేయించాడు. యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్(యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) ఈ రిపోర్టు తయారు చేసింది. మార్చి 2025లో విడుదల చేసిన నివేదికలో భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్(సీపీసీ)లో చేర్చాలని ప్రతిపాదించింది. ప్రభుత్వేతర సంస్థ ఆర్‌ఎస్‌ఎస్, భారత్ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ సంస్థ(రా)పై నిషేధం విధించాలని సూచించింది. అమెరికాలో వీటికి ఆస్తులు ఉంటే స్వాధీనం చేసుకోవాలని, ఈ సంస్థలకు చెందిన వ్యక్తులను అమెరికాలోకి అనుమతి ఇవ్వొద్దని సూచించింది. దీనిని భారత్ తప్పుపట్టింది. తప్పుడు, స్వార్థపూర్తిమైన నివేదికగా భారత అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!
యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ నేపథ్యం..
1998 ఐఆర్‌ఎఫ్ యాక్ట్ ప్రకారం యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ ఏర్పడింది. దీని కమిషనర్‌ను అమెరికా అధ్యక్షుడు నియమిస్తాడు. అమెరికా ప్రభుత్వం నిధులు ఇస్తుంది. అంటే ఇది పూర్తిగా అమెరికా ప్రభుత్వ సంస్థ. కానీ ఇండిపెండెంట్ సంస్థగా చెప్పుకుంటుంది. ఈ సంస్థ గతంలో కూడా భారత్‌కు వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చింది. భారత్‌లో మత స్వేచ్ఛ లేదు, మైనారిటీలను హింసిస్తున్నారు అని పేర్కొంటూ వచ్చింది.
భారత్‌పై ఆరోపణలు
2025 నివేదికలో మత స్వేచ్ఛ పరిస్థితులు దిగజారాయని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ తెలిపింది. భారత్‌ను కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్(సీపీసీ) అనే కేటగిరీ కింద పెట్టాలని సూచించింది. ఈ సీపీసీ కింద ఇప్పటి వరకు లేదు. కానీ ఈసారి చేర్చాలని సూచించింది. ప్రస్తుతం సీపీసీ జాబితాలో పాకిస్తాన్, ఇరాన్, నైజీరియా, నార్త్ కొరియా, ఆఫ్గానిస్తాన్, లిబియా, నౌదీ అరేబియా ఉన్నాయి. బంగ్లాదేశ్ కూడా ఈ జాబితాలో లేదు. తమది ఇస్తామిక్ దేశం అని చెప్పుకునే దేశాలు కూడా సీపీసీలో లేవు. కానీ, సెక్యూలర్ దేశమని మన రాజ్యాంగం చెబుతున్నా.. మన దేశాన్ని చేర్చాలని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ సూచించింది.
అక్కడ తగ్గిన మైనారిటీలు ..
పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఇరాన్‌తో భారత్ సమానమని పేర్కొంది. గల్ఫ్ దేశాలు కూడా సీపీసీ కింద లేవు. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఉన్న హిందువులు ఇప్పుడు 5 నుంచి 2 శాతానికి తగ్గిపోయారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఉన్న ముస్లింలు మన దేశంలో రెట్టింపు అయ్యారు. అయినా భారత్‌లో మత స్వేచ్ఛ లేదని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ పేర్కొంది. ఇది ఏలెక్కన సిఫారసు చేసిందో తెలియదు.
యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ చూపిన కారణాలు ఇవీ..
ఈ రిపోర్టులో ఇండియా సీపీసీలో చేర్చడానికి కొన్ని కారణాలు రాసింది. అందులో ఒకటి విశ్వహిందూపరిషత్ ఔరంగజేబు సమాధిని కూల్చాలని పిలుపునిచ్చిందట. అందుకే సీపీసీలో చేర్చాలట. అమెరికాలా, యూరప్‌లో ఇలాంటి పిలుపులు అనేకం ఇస్తుంటారు. ఇటీవల హనుమాన్ విగ్రహం అమెరికాలో పెట్టడాన్ని అమెరికాలోని మత సంస్థలు వ్యతిరేకించాయి. నిరసనలు తెలిపాయి. క్రిస్టియన్ సంస్థలు వ్యతిరేకించాయి. వైట్ నేషనలిస్టులు గొడవ కూడా చేశారు. భారత్‌లో ఆస్థాయిలో కూడా జరగలేదు. అయినా ఔరంగజేబు సమాధి కూల్చమనడం మత స్వేచ్ఛ లేదనడానికి ఉదాహరణగా చూపింది. మరోకారణం బెంగాల్, అస్సాంలో అక్రమంగా ఉంటున్నవారిని బంగ్లాదేశ్‌కు పంపించామట. అమెరికా అయితే అనేక కారణాలు చూపి ఇమిగ్రేషన్స్ అధికారులు అక్రమంగా ఉంటున్నవారిని అరెస్టు చేస్తున్నారు. కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. అది తప్పు కాదట. మనం వెళ్లగొడితే మాత్రం తప్పట.
వాళ్లను భారత్‌లోకి అనుమతించాలట..
యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ చేసిన మరో ముఖ్యమైన సిఫారసు ఏమిటంటే యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ ప్రతినిధులను ఇండియాలోకి అనుమతించేలా ఒత్తిడి చేయాలట. వారు మన దేశంలోకి వచ్చి ఏది తప్పు ఏది ఒప్పు అని చెబుతారట. ఇక మన రాపై ఆంక్షలు విధించాలనడం దారుణం. అమెరికా మాత్రం ప్రపంచంలో అన్ని దేశాలపై తమ ఏజెంట్ల ద్వారా మానిటరింగ్ చేస్తుంది. మన రా స్పై ఏజెన్సీ. మన దేశానికి విదేశాల్లో కుట్రలను గుర్తించి ఛేదిస్తుంది. దాడులను అడ్డుకుంటుంది. అలాంటి సంస్థను అమెరికాలోకి రాకుండా బ్యాన్ చేయాలనడం ద్వారా మన భారత్‌లో మత స్వేచ్ఛ లేదని చూపిస్తోంది.
కీలకమైన సంస్థ రా..
మన చుట్టూ ఉన్న దేశాలు మనపై నిత్యం కుట్రలు చేస్తుంటాయి. వాటిని రా గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దానిని కూడా మత స్వేచ్ఛపై దాడికా యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ పేర్కొంది. అమెరికాలో కూడా రా లాంటి సంస్థ ఉంటుంది. తమ దేశంపై దాడులను అరికట్టేందుకు గుర్తిస్తుంది. అమెరికా దాడులు చేస్తుంది. హత్యలు చేస్తుంది. ఇండియా చేస్తే మాత్రం మత స్వేచ్ఛను అణచివేయడం కింద యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ చూపింది. తాజాగా ఇరాన్‌పై దాడికి అమెరికా చూపిన కారణం మత స్వేచ్ఛ లేదనే. భారత్‌ను కూడా మత స్వేచ్ఛ లేని దేశంగానే యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ చూపింది.
సాయం విషయంలోనూ..
ఇక అమెరికా చేసే సాయంలోనూ, ఆయుధాల విక్రయ సమయంలోనూ మత స్వేచ్ఛ గురించి ప్రస్తావించాలట. మైనారిటీలపై దాడులు ఆపాలని సిఫారసు చేయాలట. ఒక అమెరికన్‌ను, ఒక యూకే వ్యక్తిని భారత్ అరెస్టు చేసిందని దీనికి ఉదామరణగా చూపింది.
ఆ యాక్ట్ పునరుద్ధరించాలని..
మనది 145 కోట్ల జనాభా కలిగిన దేశం. అలాంటి దేశంలో కొన్ని పొరపాట్లు జరగొచ్చు. కానీ అమెరికాలో ఇలాంటివి జరిగితే దేశ భద్రతగా భావిస్తున్నారు. ఎందుకంటే అధికారం ఉందని, డబ్బు ఉందని బలుపు. అదే భారత్ చేస్తే తప్పు అని చూపుతున్నారు. ట్రాన్స్ నేషనల్ రిప్రెషన్ రిపోర్టింగ్ యాక్ట్ 2024ను మళ్లీ పునరుద్ధరించాలని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ కోరింది. మనపై జరిగే దాడులను ముందస్తుగా గుర్తించడం కూడా తప్పట. అది ట్రాన్స్ నేషనల్ రిప్రెషన్ కిందకు వస్తుందట.
యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ను మొదట బ్యాన్ చేయాలి. ప్రపంచ దేశాల మత స్వేచ్ఛను నిర్ధారించే హక్కు దీనికి లేదు. విదేశాలను తక్కువ చేసి చూపించడానికి అమెరికా వాడే ఆయుధమే యూఎస్‌సీఐఆర్‌ఎఫ్.
