YS Jagan Mohan Reddy Political Strategy 2026: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం ఎలా అనే దానిపై పోస్టుమార్టం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. టిడిపి కూటమి ప్రభుత్వం దూకుడు చూస్తుంటే అది చాలా కష్టమని భావిస్తున్నారు. అందుకే కఠిన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు జిల్లాల పర్యటన, పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు జగన్. కానీ ఇప్పుడు ఉన్న టీం తో అది వర్క్ అవుట్ అయ్యేలా లేదు. అందుకే సీనియర్ లీడర్లకు మళ్ళీ టచ్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. మీ సలహాలు పాటిస్తాను చెప్పండి అంటూ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నట్లు సమాచారం. కూటమిని ఢీ కొట్టాలంటే సీనియర్ నేతల సలహాలు సూచనలు అనివార్యం అని భావించి జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* ఆ పార్టీ నేతలు అంతా తిరుగు ముఖం
ఏదైనా పార్టీ ఓడిపోతే నేతలు బయటకు వెళ్లిపోవడం సహజం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ అదే జరిగింది. ఇటీవల జరిగిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) సంకేతాలు పంపించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లినవారు తిరిగి వస్తే చేర్చుకుంటామంటూ వ్యాఖ్యానించడం విశేషం. అయితే పార్టీలో ఉన్న సీనియర్లతో పెద్దగా వర్కౌట్ కావడం లేదన్నది ఒక వాదన. శాసనమండలి వేదికగా బొత్స సత్యనారాయణ గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. కానీ అదంతా రొటీన్ అని తేలిపోతుంది. అందుకే వివిధ కారణాలతో పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారు.. ఆది నుంచి పార్టీకి దూరంగా ఉన్నవారు.. వైయస్ కుటుంబ అభిమాన నేతలు.. రాజశేఖర్ రెడ్డి సన్నిహితులను జగన్మోహన్ రెడ్డి ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
* కెవిపి పాత్ర మరువ రానిది
వైయస్ రాజశేఖర్ రెడ్డి ( y s Rajasekhar Reddy ) 2004లో అధికారంలోకి వచ్చేందుకు తెరవెనుక ఉండి వ్యూహరచన చేశారు కేవీపీ రామచంద్రరావు. పార్టీ ఆవిర్భావం నుంచి కెవిపిని జగన్ దూరం పెట్టారని అంతా భావించారు. అయితే కెవిపి సైతం కాంగ్రెస్ లో ఉంటూనే సైలెంట్ పాటిస్తున్నారు. ఇటీవల తన కుటుంబ సభ్యుడి పెళ్లిలో కెవిపిని పలకరించారు జగన్మోహన్ రెడ్డి. హౌ ఆర్ యు అంకుల్ అంటూ పలకరించడం.. కెవిపి ఆత్మీయతను పంచడం జరిగిపోయింది. రాజశేఖర్ రెడ్డి దూరమైన తర్వాత కెవిపితో ఆతరహా అనుబంధం జగన్ లో చూడలేదు. అయితే పలకరింపుతో ఆగలేదట. వారిద్దరి మధ్య భేటీ కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క కేవీపీ కాదు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను సైతం జగన్మోహన్ రెడ్డి సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇదంతా భవిష్యత్తు ప్రణాళిక కోసమేనని స్పష్టమవుతోంది.